Share News

కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేయాలి

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:34 PM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేయాలని మంచిర్యా ల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు

- మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేయాలని మంచిర్యా ల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యక ర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే ధ్యేయంగా నాయకులు పనిచేయాలన్నా రు. ఏడాది తిరగకముందే కాంగ్రెస్‌ పార్టీ పాలన వైఫల్యం చెందిందని, ఆరు గ్యారెంటీల అమలు చేయడంలో విఫలం అయ్యారన్నారు. వచ్చే సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీనే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతీ కార్యకర్త గ్రామాల్లో తిరుగు తూ కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలుపుతూ ప్రచారం చేయాలన్నారు. ప్రతీ కార్యకర్తకు అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు పాదం శ్రీనివా స్‌, చుంచు చిన్నయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్‌ చైర్మన్‌ పోడేటి శ్రీనివాస్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నడిపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నడిపల్లి విజిత్‌రావు, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ చాతరాజు రాజన్న, బీఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు అంకతి గంగాధర్‌ పాల్గొన్నారు.

గర్మిళ్ల (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల లోని ఎల్‌ఐసీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు హాజీపూర్‌ మండల బీఆర్‌ ఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 11:34 PM