విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:20 PM
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
జన్నారం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. నిత్యావసర సరుకులను, రిజిష్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్ధులను ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఎంఈవో విజయ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.