Share News

Nalgonda: నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో బర్డ్‌ఫ్లూ

ABN , Publish Date - Mar 23 , 2025 | 05:27 AM

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో పశు సంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పౌలీ్ట్రఫామ్‌లోని రెండు లక్షల కోళ్ల ఖననానికి చర్యలు చేపట్టారు.

Nalgonda: నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో బర్డ్‌ఫ్లూ

  • రెండు లక్షల కోళ్ల ఖననానికి చర్యలు.. 6కోట్ల మేర నష్టం

చిట్యాల రూరల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో పశు సంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పౌలీ్ట్రఫామ్‌లోని రెండు లక్షల కోళ్ల ఖననానికి చర్యలు చేపట్టారు. గుండ్రాంపల్లి గ్రామశివారుల్లో 15 ఏళ్లుగా వీఎస్‌కే పౌలీ్ట్రఫామ్‌ నిర్వహిస్తున్న వంగోటి బాలకృష్ణారెడ్డి.. ఈ నెల 17న సుమారు వెయ్యి కోళ్లు మృతి చెందడంతో పశు సంవర్ధకశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వీఎ్‌సకే పౌలీ్ట్రఫామ్‌ వైద్యులు, ప్రత్యేక బృందాలతో పశు సంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమేష్‌ ఈ నెల 18న పౌలీ్ట్రఫామ్‌ను తనిఖీ చేశారు. షెడ్లు, కోళ్లను పరిశీలించారు.


ఈ పౌలీ్ట్రఫామ్‌లో మరణించిన కోళ్ల కళేబరాల నమూనాలను పరీక్షించిన హైదరాబాద్‌, భోపాల్‌ ల్యాబ్‌లు బర్డ్‌ఫ్లూ వల్లే అవి మరణించాయని ఈ నెల 19న నివేదిక ఇచ్చాయి. దీంతో రాష్ట్ర పశు సంవర్ధకశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది ఈ నెల 20న వీఎ్‌సకే పౌలీ్ట్రఫామ్‌కు చేరుకున్నారు. పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేక వాహనాల్లో కోళ్లఫామ్‌లోకి వెళ్లి శనివారం సాయంత్రం వరకూ 1.14 లక్షల కోళ్లకు మత్తుమందు ఇచ్చి చంపేశారు. ఎక్స్‌కవేటర్‌తో కోళ్ల ఫామ్‌ మధ్య గల స్థలంలో పది అడుగుల లోతు గుంతలు తవ్వించి కోళ్ల కళేబరాలు, గుడ్లు పూడ్చి పెట్టారు. మొత్తంగా యజమానికి రూ.6 కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు సమాచారం.

Updated Date - Mar 23 , 2025 | 05:27 AM