కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 09:35 AM
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వేల్, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్..

గజ్వేల్, మార్చి 20: మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం టులెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్ ఒక్కసారి కూడా గజ్వేల్ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు. ప్రజలకు వద్దకు రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వేల్, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైరయ్యారు. అల్లరిమూకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తాళాలు పగలుగొట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాయంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు.
Also Read:
ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం..
పైకి ఆశా వర్కర్.. చేసే పనులు మాత్రం వేరే..
For More Telangana News and Telugu News..