Home » Gajwel
రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు.
గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్కసారి గజ్వేల్కు రావాలని.. నేనున్నానంటూ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోరుతున్నారు.
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఆ జంట మధ్య పొరపొచ్చాలొచ్చాయి పరస్పరం గొడవపడ్డారు. ఇంట్లో నుంచి వెళ్లిన భర్త తాను చనిపోతున్నానని, తన చావుకు భార్యే కారణమంటూ సెల్పీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
Telangana: గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఆపై కళ్యాణ లక్ష్మీ , షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని...
మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పది నెలలుగా కనిపించడం లేదని, వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దాదాపు 10 నెలలు అయింది. నేటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం నియోజకవర్గంలో పర్యటించడం లేదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన నగదు జీతంగా తీసుకుంటూ.. ఆయన నియోజకవర్గంలో ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. దీంతో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ప్ర్తతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు హాజరు కాలేదు. సరికదా.. ఎమ్మెల్యేగా ప్రతిపక్షనేతగా గజ్వేల్ నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించలేదు.
కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువని, దీంతో ఆయన తన తండ్రి కేసీఆర్ను ఏమైనా చేశాడేమోనని అనుమానం వస్తోందని, ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామలతో పాటు పునరావాస కాలనీ గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన అథారిటీల పరిధిలోని వివిధ శాఖల కార్యాలయాలు మరో ప్రాంతానికి మారబోతున్నాయి.