Hyderabad: మోసాలకు కలరింగ్.. నకిలీ యాప్‌లు, స్కీములకు సెలబ్రిటీల ప్రచారం
ABN , Publish Date - Mar 15 , 2025 | 08:50 AM
ప్రస్తుత సమాజంలో మోసాలే రాజ్యమేలుతున్నాయి. మాయమాటలతో బురిడీ కొట్టించి తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రధానంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ తరహ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సోషల్ మీడియా మోసాలపై ప్రజల్లో అవగాహన కొంచెం తక్కువగా ఉండటంతో మోసగాళ్లు రోజుకు ఎక్కడో ఒకచోట బలై పోతూనే ఉన్నారు.

- కోట్లు కొల్లగొడుతున్న క్రిమినల్స్
- సెలబ్రిటీలను నమ్మి మోసపోతున్న జనం
వ్యాపార సంస్థలో డీలర్‌షిప్ పేరిట యాప్‌ను తయారు చేయించిన నిర్వాహకులు సినీ రంగానికి చెందిన ప్రముఖ కమెడియన్, టీవీ, సినీనటి(Comedian, TV, film actress)తో ప్రారంభోత్సవం చేయించారు. ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పలు ఉత్పత్తులను పరిచయం చేసి, వాటిని విక్రయించేందుకు డీలర్లు కావాలని ప్రచారం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల చొప్పున వందలాది మంది నుంచి రూ.20 కోట్ల వరకు కొల్లగొట్టారు.
హైదరాబాద్ సిటీ: సబ్బు బిళ్ల, మందు బిళ్ల మొదలుకొని రూ. కోట్ల విలువైన విల్లాలు, ప్లాట్ల వరకు ప్రతి వస్తువూ మార్కెట్లో అమ్ముడు పోవాలంటే నిర్వాహకులు ఎంచుకుంటున్న మొదటి మార్గం సెలబ్రిటీలతో ప్రచారం చేయించడం. కల్పించడం. హీరో హీరోయిన్లు, క్రీడాకారుల ప్రభావం నేటి యువతపై చాలా ఎక్కువగా ఉంటోంది. ఏదైనా విషయాన్ని సెలబ్రిటీలు చెబితే చాలామంది గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. దాన్నే కొన్ని కంపెనీలు, సంస్థలు, మోసగాళ్లు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తమ యాప్‌లు, ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటున్నారు. వారితో ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తూ రూ.కోట్లలో దండుకుంటున్నారు. మోసం బయటపడ్డాక పరారవుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
తప్పని తిప్పలు సెలబ్రెటీలతో నకిలీ హెల్త్ ప్రొడక్టులు, ఫుడ్ ప్రొడక్టులకు మోసగాళ్లు ప్రచారం కల్పిస్తున్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చని పెద్ద పెద్ద హోటళ్లలో సెలబ్రిటీల ద్వారా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల వందల కోట్ల రూపాయల స్కామ్‌లకు పాల్పడిన ఎంఎల్‌ఎం మోసాలపై పోలీసులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. అమాయకులను మోసం చేసి రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను కటకటాల్లోకి నెడుతున్నారు. అతిపెద్ద మల్టీలెవల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు.
ఆ లిస్టులో అనిల్‌కపూర్, షారుఖ్‌ఖాన్(Anil Kapoor, Shah Rukh Khan), బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీష్రాఫ్, అల్లుశిరీష్, పూజాహెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులు ఉండడం గమనార్హం. వారిలో కొద్దిమంది నోటీసులకు స్పందించి తమ లాయర్ల ద్వారా సమాధానాలు ఇచ్చారు. సమాధానాలు ఇవ్వని సెలబ్రిటీలకు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వినిమోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్‌లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధించవచ్చు. రూ.10లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలుశిక్ష తప్పదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
- ప్రముఖ యూట్యూబర్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తుండడంతో పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. అలాంటి వారి మృతికి తప్పుడు వస్తువులను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు.
- ఇటీవల ఒక ప్రముఖ తెలుగు హీరో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును తప్పుపడుతూ ప్రైవేట్ క్యాబ్‌లకు ప్రచారం కల్పించారు. ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు అధికారులు ఆ హీరోకు నోటీసులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News