కరెంట్ షాక్ కొట్టిన తండ్రిని కాపాడి అదే షాక్‌తో కుమారుడి మృతి
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:13 AM
కరెంట్ షాక్ కొట్టిన తండ్రిని కాపాడి.. కుమారుడు అదే కరెంట్ షాక్‌తో చనిపోయాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న బచ్చన్నపేటకు చెందిన సందెల వెంకటేశ్వర్లు..

జనగామ జిల్లా కేంద్రంలో ఘటన
జనగామ రూరల్/బచ్చన్నపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): కరెంట్ షాక్ కొట్టిన తండ్రిని కాపాడి.. కుమారుడు అదే కరెంట్ షాక్‌తో చనిపోయాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న బచ్చన్నపేటకు చెందిన సందెల వెంకటేశ్వర్లు.. జనగామలోని కురుమవాడలో నివాసముంటున్నాడు. ఇతడికి భార్య, కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. జనగామలోని వికా్‌సనగర్‌లో కొత్తగా ఇల్లు కడుతున్న వెంకటేశ్వర్లు శుక్రవారం గోడలకు నీళ్లు పట్టేందుకు వెళ్లాడు.
హోలీ పండుగ సెలవుదినం కావడంతో తండ్రితో రెండో కుమారుడు కని్‌ష్కవర్ధన్(12)కూడా వెళ్లాడు. గోడల పక్కన కరెంట్ వైర్ తెగిపడిన విషయం తెలియని వెంకటేశ్వర్లు నీళ్లు కొడుతూ షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న కనిష్క్ వెంటనే తండ్రిని కర్రతో పక్కకు తోశాడు. తండ్రి నీటినుంచి బయటపడగా.. కుమారుడు జారి ఆ నీటిలోనే పడ్డాడు. తండ్రి షాక్‌నుంచి తేరుకునేలోపే కనిష్క్ మృతిచెందాడు.