Food Poisoning: పుడ్ పాయిజనింగ్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Feb 07 , 2025 | 09:50 PM
Food Poisoning: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వరంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయింది.

మహబూబాబాద్, ఫిబ్రవరి 07: తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. గురుకుల పాఠశాలలో చదువుతోన్న 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో.. అందులో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి.. వారిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి.. చికిత్స్ అందిస్తున్నారు.
ఈ పాఠశాలలో మొత్తం 500 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. గురువారం సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చే సమయంలో బొబ్బర్లు పెట్టారు. అవి తిన్న విద్యార్థులు.. గత అర్థరాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వాంతులు, కడుపునొప్పి, విరోచనాలు కావడంతో.. తీవ్ర అస్వస్తతకు వారు గురయ్యారు. దీంతో పాఠశాలలోని ఏఎన్ఎం వెంటనే మందులు ఇచ్చింది. అయితే 16 మందిలో నలుగురు పరిస్థితి కొంత తీవ్రంగా మారడంతో.. వారిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం కోసం.. డైటా ఛార్జీలను 40 శాతం మేర పెంచామన్నారు. అయినా సిబ్బంది తీరు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వారికి నాణ్యమైన విద్య పెట్టాలని సిబ్బందికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ సూచించారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత స్పందించారు. ఈ కాంగ్రెస్ ప్రభుతం ఏర్పడిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. చిన్నారుల భవితకు బాటలు వేయాల్సిన ఈ ప్రభుత్వం నరకానికి బాటలు వేస్తోందని విమర్శించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: కేటీఆర్‍కు మరో అరుదైన గౌరవం
Also Read: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్... పాల్గొన్న మన్నవ మోహన కృష్ణ
Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు
Also Read: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్
For Telangana News And Telugu News