Share News

E Car Race Scam: ఈడి విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా..

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:52 PM

ఫార్ములా ఈ కారు రేస్ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి నేడు ఈడి విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు రావడానికి తనకి మరింత సమయం కావాలని కోరారు.

E  Car Race Scam: ఈడి విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా..
BLN Reddy

E Car Race Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేసు కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక వైపు ACB దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు ED విచారణకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ హయాంలో HMDA చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన బీఎల్ఎన్ రెడ్డిని విచారణకు పిలిచింది. అయితే, బీఎల్ఎన్ రెడ్డి నేడు ఈడి విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు రావడానికి తనకి మరింత సమయం కావాలని కోరుతూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు.


కాగా, ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి.. నగదు బదిలీలో అవకతవకలు నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించి.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. తమ పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ ద్వారానే ఎస్‌ఈవోకు దాదాపు రూ.55 కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు దానకిషోర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Updated Date - Jan 02 , 2025 | 04:02 PM