Gachibowli: నువ్వా నేనా సై..!
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:53 AM
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు.

సరదాగా కరాటే ఆడిన మంత్రి పొన్నం, స్పీకర్ ప్రసాద్
గచ్చిబౌలిలో 4 కియో కరాటే చాంపియన్‌షి్‌ప-25 ప్రారంభం
గచ్చిబౌలి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 4 కియో కరాటే చాంపియన్‌షి్‌ప- 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్‌తోపాటు మంత్రి పొన్నం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, పొన్నం కాసేపు కరాటే ఆడి ప్రేక్షకులను అలరించారు. అనంతరం స్పీకర్, మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా క్రీడలన్నింటికీ తెలంగాణ కేంద్రబిందువుగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.