Home » Gachibowli
Hyderabad Drug Bust: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలో పెద్దఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి బయో డైవర్సిటీ విభాగ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మొక్కల పెంపకం బిల్లుపై సంతకం కోసం కాంట్రాక్టర్ వద్ద రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారు
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఎన్నో ఏళ్లుగా అవి రెవెన్యూ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది. ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండడం వల్ల.. చెట్లు భారీగా పెరిగాయని వివరించింది.
కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టుపెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చుని అసలు అమ్ముకున్నారో, కుదవపెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివని.. హెచ్సీయూవి కాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు తెలంగాణ సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయన్నారు.
భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ రూ.5,200 కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారు. వాస్తవానికి అది బిల్లీ రావుతో కేటీఆర్ కుదుర్చుకున్న లంచం పద్దు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. 2012లో కేటాయించిన 2,185 ఎకరాల భూమి మొత్తం యూనివర్సిటీదే అని వారు ప్రకటించారు, వర్సిటీ భూములను కాపాడాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు