Share News

Sridhar Babu: హెచ్‌సీయూ భూములను ముట్టుకోం

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:52 AM

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభలో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ లేవనెత్తిన అంశంపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు.

Sridhar Babu: హెచ్‌సీయూ భూములను ముట్టుకోం

  • కబ్జాలను నిలువరించేందుకే హైడ్రా: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభలో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ లేవనెత్తిన అంశంపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు. అక్కడున్న రెండు చెరువులు, రాక్‌ హిల్స్‌ను సర్కారు పరిరక్షిస్తుందని వెల్లడించారు. హెచ్‌సీయూ భూములను ప్రొటెక్టు చేస్తామన్నారు. రియల్‌ ఏస్టేట్‌ మందగమనానికి, హైడ్రాకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణిలో 9,078 ఫిర్యాదులు వచ్చాయని, కబ్జాలను నిలువరించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. హైడ్రా కార్యాలయం వద్ద ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు వేచి ఉంటున్నారని, కబ్జాలతోపాటు ఇతర సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు.

Updated Date - Mar 25 , 2025 | 04:52 AM