Share News

Aadi Srinivas: హరీశ్‌రావుపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:43 AM

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభలో ఫొటోలు తీసి, మీడియాకు పంపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని గురువారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు.

Aadi Srinivas: హరీశ్‌రావుపై చర్యలు తీసుకోండి

  • స్పీకర్‌కు ప్రభుత్వ విప్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): నిబంధనలను ఉల్లంఘించి శాసనసభలో ఫొటోలు తీసి, మీడియాకు పంపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని గురువారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్నప్పుడు హరీ్‌షరావు.. ఫొటోలు తీసి మీడియాకు పంపారని తెలిపారు. రెండు రోజుల కిందట ఒక అంశంపై వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ సభ్యులు.. అసెంబ్లీ లాంజ్‌లో, ప్రధాన ద్వారం వద్దా నిరసన తెలిపారని, ఆ సందర్భంగా కూడా వీడియోలు, ఫొటోలు తీసి మీడియాకు పంపారని పేర్కొన్నారు.


హరీ్‌షరావు సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కేటీఆర్‌ అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆది శ్రీనివాస్‌ కోరగా.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్‌ గురువారం ప్రకటించారు. హరీ్‌షరావు స్పందిస్తూ బట్టలిప్పి కొడతానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అయితే ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అన్నారని తెలిపారు. ఈ మాటలను కూడా రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అసెంబ్లీ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ తెలిపారు.

Updated Date - Mar 28 , 2025 | 03:43 AM