Harish Rao: సీడబ్ల్యూసీ లేఖ చూపిస్తే క్షమాపణ చెప్తారా ?
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:34 AM
సీడబ్ల్యూసీ అలా చెప్పలేదన్న ఉత్తమ్ మాటలు నిజమైతే తానే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సభలో, ఆ తర్వాత ఆయా అంశాలపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.

తుమ్మిడిహట్టి అంశంపై మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ సవాల్
కొత్తగా కట్టిన ప్రాజెక్టులేవి, కొత్త ఆయకట్టు ఎంత? అని నిలదీత
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రూ.600 కోట్ల విలువైన పంటనష్టం
సభలో కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు స్పష్టం: హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 26, (ఆంధ్రజ్యోతి): మీకు తుమ్మడిహట్టి వద్ద సరిపడా నీళ్లు లేవు అందువల్ల ప్రత్యామ్నాయం చూసుకోండి.. అంటూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఇచ్చిన లేఖ తమ వద్ద ఉందని, దానిని చూపిస్తే క్షమాపణ చెబుతారా? అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో సవాల్ విసిరారు. సీడబ్ల్యూసీ అలా చెప్పలేదన్న ఉత్తమ్ మాటలు నిజమైతే తానే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సభలో, ఆ తర్వాత ఆయా అంశాలపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నందువల్లే కేంద్రం అనుమతులు ఇచ్చిందని అన్నారు. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు సాధ్యం కాదనే ఫైవ్‌మన్ కమిటీ చెప్పింది తప్ప మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించవద్దని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉత్తమ్ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. గత బడ్జెట్ సందర్భంగా సాగునీటి పద్దుల చర్చలో కొత్తగా ఆరు ప్రాజెక్టులు కడతామని, ఆరు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని హరీశ్ గుర్తు చేశారు.
ఆ ప్రాజెక్టులు ఎక్కడ కట్టారు? అదనంగా నీటిని ఎక్కడిచ్చారో చెప్పాలి? అని ప్రశ్నించారు. దేవాదులలో మోటార్లు ప్రారంభించకుండా ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రూ.600కోట్ల విలువైన పంట ఎండిపోయిందని, ఎండిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది కృష్ణానదిలో 1,020 టీఎంసీలు నీళ్లు వచ్చాయని, 66:34 ప్రతిపాదనల ప్రకారం తెలంగాణకు 346 టీఎంసీలు రావాల్సి ఉండగా.. ప్రభుత్వం 266టీఎంసీలనే వాడిందని పేర్కొన్నారు. ఆర్డీఎ్‌సలో తెలంగాణ వాటా 15 శాతం కాగా 6 శాతమే వాడుకున్నారని చెప్పారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గంధమల్ల ప్రాజెక్టుల కింద కెనాళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై హరీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక, శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైన విషయం స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సపై బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు.. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇక్కడ చోటే భాయ్ ఎంత అవినీతి చేసినా ఢిల్లీలో బడే భాయ్ ఆదుకుంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News