Home » Uttam Kumar Reddy Nalamada
స్కిల్స్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విప్లవాత్మక పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ధాన్యంలో తేమ 17 శాతం పైన ఉంటే కొనుగోలు చేయబోమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ఏడాది 30 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధంగా ఉంచామని, 3.10 కోట్ల మందికి రేషన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు
కృష్ణా ట్రైబ్యునల్ 2 విచారణలో తెలంగాణ హక్కుల సాధన కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న్యాయ బృందంతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు పోరాటం చేయాలని చెప్పారు.
Water Conflict: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తోంది. ఆ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశం అయింది. సీనియర్ ఐఏఎస్ అయిన ఆయనకు నిజాయితీపరుడిగా పేరున్నప్పటికీ.. విధులు, బాధ్యతల పట్ల ప్రభుత్వం ఆశించినంత వేగంగా స్పందించడం లేదనే అభిప్రాయాలున్నాయి.
శ్రీరామనవమి పండుగ (ఆదివారం) రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిఽధులు సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
రేషన్‌కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టుకోనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఇందుకు వేదిక కానుంది.
Minister Uttam Kumar Reddy: .సన్నబియ్యం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెల్ల రేషన్ కార్డ్ దారులకు మూడు రంగుల కార్డ్... ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.