Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:18 AM
‘‘రేవంత్‌రెడ్డి, చంద్రబాబు మధ్య పరోక్ష సంబంధం ఉంది. అందుకే ఏపీ జల దోపిడీకి సహకరిస్తూ.. తెలంగాణ సీఎం గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమో..?’’ అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

అందుకే ఏపీ జల దోపిడీని అడ్డుకోవడం లేదు: హరీశ్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘‘రేవంత్‌రెడ్డి, చంద్రబాబు మధ్య పరోక్ష సంబంధం ఉంది. అందుకే ఏపీ జల దోపిడీకి సహకరిస్తూ.. తెలంగాణ సీఎం గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమో..?’’ అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి రోజూ పది వేల క్యూసెక్కుల నీటిని ఏపీ సర్కారు తరలించుకుపోతుంటే.. అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలుంటే.. 657 టీఎంసీలు తీసుకుపోయిందని.. 25 రోజుల్లోనే 65 టీఎంసీలు తరలించిందని పేర్కొన్నారు.
తన వాటాలో తెలంగాణ ఇప్పటి వరకు 220 టీఎంసీలను మాత్రమే వాడుకుందని, మరో 123 టీఎంసీలను వినియోగించాల్సి ఉందని.. మన వాటా రాబట్టుకోవడంలోనూ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. లెక్కకుమించి నీటిని తరలిస్తున్న ఏపీని అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారుకు చేతకాకుంటే తాము వస్తామని.. అందరం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేద్దామని పేర్కొన్నారు.