Share News

HMDA: రూ.100 కోట్లతో ‘సాగర్‌’కు సొబగులు !

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:11 AM

హైదరాబాద్‌ మహా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.

HMDA: రూ.100 కోట్లతో ‘సాగర్‌’కు సొబగులు !

  • పర్యాటక అభివృద్ధికి హెచ్‌ఎండీఎ మాస్టర్‌ప్లాన్‌

  • ప్రపంచ స్థాయి ఏజెన్సీ కోసం గ్లోబల్‌ టెండర్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీ కోసం ఇప్పటికే గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. హుస్సేన్‌సాగర్‌ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి ల్యాండ్‌మార్క్‌ ఆర్కిటెక్చర్‌, రవాణా మార్గాలు, వాణిజ్య, నివాస అభివృద్థి, పర్యాటక అభివృద్థి మొదలైన ప్రదేశాలను గుర్తించనుంది.


వీధుల అభివృద్థి, పర్యావరణ పరిరక్షణ చర్యలు, రవాణ-ఆధారిత అభివృద్థి, వినోద అంశాలు, పర్యాటక సౌకర్యాలు, స్మార్ట్‌ స్ర్టీట్‌ లైటింగ్‌ నిఘా, భద్రత, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ల్యాండ్‌స్కేప్‌ డిజైన్‌ తదితరాలను చేపట్టనుంది. నీటి పైపులు, మురుగునీటి లైన్లు, వర్షపునీటి డ్రెయిన్లు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టురా రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ కారిడార్లు, రోడ్లు, వంతెనలు, ప్రజా రవాణా మార్గాలు, నడక మార్గాలు, సైకిల్‌ ట్రాక్‌లు తదితర ఈ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చనున్నారు. వివరణాత్మకంగా ఆర్కిటెక్చరల్‌ డిజైన్లను రూపొందించనున్నారు.


నాణ్యతలో రాజీపడం: అజితేష్ కొరుపోలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన ASBL, కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద తమ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ASBL ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ భూమి పూజ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. కూకట్‌‌పల్లిలో గతేడాది ప్రాజెక్ట్‌‌ను లాంచ్ చేసిన మొదటి రోజే రూ.500 కోట్ల విలువైన అమ్మకాలను ఈ కంపెనీ‌ సాధించింది. ఏఎస్‌‌బీఎల్‌‌ ల్యాండ్‌‌మార్క్ ప్రాజెక్ట్‌‌ మొత్తం 6.6 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3, 3.5, 4 బీహెచ్‌‌కే అపార్ట్‌‌మెంట్లను కట్టబోతున్నారు. పట్టణాల్లోని కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా ఏఎస్‌‌బీఎల్‌‌ ల్యాండ్‌‌మార్క్‌‌ను డిజైన్ చేశామని కంపెనీ సీఈఓ కొరుపోలు అజితేష్‌‌ అన్నారు. ఇళ్ల నాణ్యతలో రాజీపడమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాటాదారులు, కంపెనీ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

Updated Date - Mar 23 , 2025 | 04:11 AM