Home » Hussain Sagar
హైదరాబాద్ మహా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.
హుస్సేన్‌సాగర్(Hussain Sagar)లో ఆదివారం మహాహారతి సందర్భంగా బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చి బోటు ప్రమాదానికి కారణమైన అధికారిని సస్పెండ్ చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు.
Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. రెండు రోజులుగా రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో నాగారానికి చెందిన అజయ్ అనే యువకుడు మిస్సింగ్ అయ్యాడు. బోట్లలో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. అజయ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. అతను ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
గణతంత్ర దినోత్సవ వేళ.. భరతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బోటు దగ్ధమవడంతో పలువురికి గాయాలయ్యయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హుస్సేన్‌సాగర్(Hussain Sagar) నుంచి దుర్వాసన రాకుండా శుక్రవారం డ్రోన్‌తో స్ప్రే కొట్టారు. కూకట్పల్లి(Kukatpally) నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వ్యర్థాలు చేరే ప్రాంతాల్లో పెద్దఎత్తున పూడిక చేరగా తొలగింపు ప్రక్రియ సాగుతోంది. వ్యర్థాలను యంత్రాలతో తొలగిస్తుండగా పెద్దఎత్తున దుర్వాసన వస్తోంది.
Telangana: జలవిహార్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జలవిహార్ డైరెక్టర్ విజయ్ ఆదిత్య రాజు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలానికి కేటాయించిందని.. అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Telangana: ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి.
గణేశుడి నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ నలుమూలల నుంచి వస్తున్న వినాయకులతో రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.