Share News

Hyderabad: హె‌చ్‌సీయూకు 100కోట్ల ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ గ్రాంట్‌

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:06 AM

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) మరో ఘనతను సొంతం చేసుకుంది. హెల్త్‌ అండ్‌ మెడికల్‌ టెక్నాలజీ్‌సలో పరిశోధన, ఆవిష్కరణల నిమిత్తం హెచ్‌సీయూ నేతృత్వంలోని బృందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల గ్రాంట్‌ మంజూరైంది.

Hyderabad: హె‌చ్‌సీయూకు 100కోట్ల ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ గ్రాంట్‌

  • వైద్యరంగంలో పరిశోధనల ప్రాజెక్టుకు కేటాయింపు

  • వర్సిటీ చరిత్రలో ఇదో మైలురాయి: వీసీ బీజే రావు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) మరో ఘనతను సొంతం చేసుకుంది. హెల్త్‌ అండ్‌ మెడికల్‌ టెక్నాలజీ్‌సలో పరిశోధన, ఆవిష్కరణల నిమిత్తం హెచ్‌సీయూ నేతృత్వంలోని బృందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల గ్రాంట్‌ మంజూరైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌- పార్టనర్‌షిప్స్‌ ఫర్‌ యాక్సిలరేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎన్‌ఆర్‌ఎ్‌ఫ-పెయిర్‌) సీఈవో నుంచి హెచ్‌సీయూ వీసీ బీజే రావుకు లేఖ అందింది.


ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఏడు హబ్‌-ఎన్‌-స్పోక్‌ మోడల్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా హెచ్‌సీయూ ప్రతిపాదించిన ప్రాజెక్టు ఎంపిక కావడం సంతోషంగా ఉందని, వర్సిటీ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు అత్యాధునిక, సహకార పరిశోధనల్లో యూనివర్సిటీ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ బ్రహ్మానందం మానవతి, కో-ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ సిబా కుమార్‌ వ్యవహరిస్తారని, యూనివర్సిటీ ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సామ్రాట్‌ భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేస్తారని వెల్లడించారు

Updated Date - Apr 18 , 2025 | 04:06 AM