Hyderabad: ఇదోరకం మోసం.. నెమలి అవయవాలంటూ..
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:09 AM
నగరంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. అవతలి వాళ్లు ఏమైపోయినా ఫర్వాలేదు.. నా జేబులోకి మాత్రం డబ్బులు రావాలి.. ప్రస్తుతం జరుగుతున్న తంతు ఇదే.. నెమలి అవయవాలు అంటూ కోడి కాళ్లు విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు మహిళలను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- కోడి కాళ్ల విక్రయానికి యత్నం
- ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు
- మోసానికి పాల్పడితే శిక్ష తప్పదని మందలింపు
హైదరాబాద్: నెమలి అవయవాలంటూ కోడి కాళ్లు విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు మహిళలను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ డీఆర్‌వో శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ ఆర్‌కే నగర్ డంపింగ్ యార్డ్‌కు చెందిన ముగ్గురు మహిళలు గురువారం జుమ్మెరాత్ బజార్ మార్కెట్‌లో జాతీయ పక్షి నెమలి తల, కాళ్లు తమ వద్ద ఉన్నాయని అమాయకులను నమ్మించి విక్రయానికి యత్నించారు. గమనించిన గోపాల్ అనే వ్యక్తి విషయాన్ని అటవీశాఖ డీఆర్‌వో శివప్రసాద్‌కు సమాచారం ఇచ్చాడు.
ఈ వార్తను కూడా చదవండి: RTC buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు పది నిమిషాలకో బస్సు
ఆయన సిబ్బందితో జుమ్మెరాత్ బజార్ చేరుకొని ముగ్గురు మహళలను అదుపులోకి తీసుకొని షాహినాయత్‌గంజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు మహిళలను విచారించగా.. రద్దీ మార్కెట్‌లలో కోడి తల, కాళ్లను నెమలి ఈకలతో జతచేసి నెమలి అవయవాలను విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. మరోసారి ఇలాంటి మోసానికి పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించి వారిని విడిచిపెట్టారు. నెమలి తల, కాళ్లు, ఈకలను విక్రయిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నిజం కాదని అటవీశాఖ అధికారులు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News