Share News

Rajendra Prasad Apology: డేవిడ్ వార్నర్‌కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:24 PM

Rajendra Prasad Apology: రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా డేవిడ్ వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చను రేపుతున్నాయి. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Rajendra Prasad Apology: డేవిడ్ వార్నర్‌కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు
Rajendra Prasad Apology to David Warner

హైదరాబాద్, మార్చి 25: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు (Cricketer David Warner) సినీనటుడు రాజేంద్రప్రసాద్ (Actor Rajendra Prasad) క్షమాపణలు చెప్పారు. డేవిడ్ వార్నర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదన్నారు. రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. వార్నర్‌పై ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని అందుకు వార్నర్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజేంద్రప్రసాద్ ఓ వీడియోను విడుదల చేశారు.


అయితే రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వార్నర్‌నుపై రాజేంద్రప్రసాద్ సరదాగా కామెంట్స్ చేశారు. కానీ అందులో రాజేంద్రప్రసాద్ అభ్యంతరకరమైన పదాన్ని వాడారంటూ నిన్నటి నుంచి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్‌పై చాలా మంది సీరియస్ అయ్యారు. ఆయన సరదాగా మాట్లాడినప్పటికీ ఆ విధానం కరెక్ట్‌గా లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలు ట్రోల్‌కు గురవడంతో రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. డేవిడ్ వార్నర్ అన్నా, ఆయన క్రికెట్‌ అన్నా తనకు ఇష్టమని, అలాగే తమ సినిమాలంటే డేవిడ్‌ వార్నర్‌కు ఇష్టపడతారన్నారు. తమ మధ్య మంచి రిలేషన్ ఉందని, అయితే నిన్నటి తన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారని.. ఇందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు.


ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఏమన్నారంటే..

‘డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చారు. డేవిడ్‌ వార్నర్‌ను క్రికెట్ ఆడవయ్యా అంటే డ్యాన్సులు వేస్తున్నాడు. మామూలోడు కాదండి వీడు. ఏయ్ వార్నరూ. బీ వార్నింగ్’ అంటూనే రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడిన తీరు బాగోలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:26 PM