Share News

Viral: బాబోయ్.. పీపాలు పీపాలు ఖాళీ చేసినట్లున్నాడు.. ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా..

ABN , Publish Date - Jan 01 , 2025 | 08:53 AM

ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో..

Viral: బాబోయ్.. పీపాలు పీపాలు ఖాళీ చేసినట్లున్నాడు.. ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా..
Drunk and Drive Case

కొన్ని సంఘటనలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించడానికి పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడం సర్వసాధారణం. ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో 50 మి.గ్రాముల ఆల్కహల్ శాతం ఉంటే ఆ వ్యక్తి స్పృహాలో లేనట్లు గుర్తిస్తారు. బ్రీత్ అనలైజర్‌లో వందకు మించి ఆల్కహల్ శాతం నమోదైన సందర్భాలు లేకపోలేదు. కానీ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని పంజాగుట్ట సమీపంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పంజాగుట్ట సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ పెట్టి గాలి ఊదమన్నారు. ఆ వ్యక్తి గాలి ఊదగానే బ్రీత్ ఎనలైజర్ మిషన్ వణికిపోయింది. కేవలం బ్రీత్ ఎనలైజర్ మాత్రమే కాదు.. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అవాక్కయ్యారు. బ్రీత్ ఎనలైజర్‌లో ఏకంగా 550 రీడింగ్ నమోదుకావడంతో అంతా ఆశ్చర్యపోయారు.


ఎప్పుడంటే..

31 డిసెంబర్ 2024 రాత్రి 10.50 గంటల సమయంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, వెంగళరావు పార్క్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ మార్గంలో TS09EK3617 బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. 550 ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది. రీడింగ్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తి పేరు తెలియనప్పటికీ ఆ బైక్ మాత్రం రియాజుద్దీన్ పేరుమీద ఉంది. బైక్ సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.


ఉదయం ఓ కేసు.. రాత్రికి డ్రంక్ అండ్ డ్రైవ్..

TS09EK3617 బైక్‌పై 31 డిసెంబర్ 2024 ఉదయం 9.17 గంటలకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న కేసు నమోదైంది. అదే బైక్‌పై రాత్రి 10.53 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ఉదయం హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటూ ఆషిఫ్‌ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్ వేయగా.. రాత్రి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఈ బైక్‌పై ఇప్పటివరకు పది చలనాలు పెండింగ్ ఉండగా.. ఇవ్వన్నీ హెల్మెట్‌కు సంబంధించినవే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 01 , 2025 | 08:53 AM