Prisam Pub: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
ABN , Publish Date - Feb 07 , 2025 | 06:08 PM
Prisam Pub: అతి చిన్న వయస్సులోనే చోరీలు చేయడం ప్రారంభించాడు. అందుకు ఇంజనీరింగ్ కాలేజీలే లక్ష్యంగా పెట్టుకొన్నారు. అంతేకాదు..333 కోట్లు సంపాదించాలన్నాడు.

జీవితంలో ఎవరైనా ఏం లక్ష్యంగా పెట్టుకొంటారు. మంచి ఉద్యోగం లేదా విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకొంటారు. కానీ ఇటీవల ప్రిజం పబ్ లో పోలీసులపై కాల్పులకు తెగబడి అడ్డంగా దొరికిపోయిన బత్తుల ప్రభాకర్ లక్ష్యాన్ని చూస్తే మైండ్ బ్లాంక్ కాదు.. అన్ని రంగులు ఈస్ట్ మన్ కలర్‍లో కనిపిస్తాయి. పోలీసుల అదుపులో ఉన్న ఈ జగత్ కిలాడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్.. 100 మంది అమ్మాయిలను అనుభవించడం.. జీవిత కాలంలో రూ.333 కోట్లు సంపాదించడం.. ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీలు చేయడంతోపాటు విశాఖపట్నం జైలులోని ఖైదీలను కాల్పి చంపడం.. ఇలా అతగాడి లక్ష్యాలను చూసి పోలీసులు సైతం ఖంగు తిన్నారు.
అయితే అతడిపై ఉన్న పాత నేరాల చిట్టాను పోలీసులు బయటకు దీశారు. దీంతో బత్తుల ప్రభాకర్‍పై దాదాపు 80 కేసులు నమోదైనట్లు గుర్తించారు. అంతేకాదు అతగాడు.. రాహుల్ రెడ్డి అలియాస్ సర్వేష్ రెడ్డి అలియాస్ హర్షా రెడ్డి అలియాస్ బిట్టు తదితర మారుపేర్లతో చలామణి అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా పలు పేర్లతో చలామణి అవుతూ.. రెండు తుపాకీలను తన వెంట ఉంచుకొంటూ.. నెలకు సింపిల్ గా ఓ చోరీ చేయడం అలవాటుగా బత్తుల ప్రభాకర్ మార్చుకొన్నాడు.
Also Read: భీష్మ ఏకాదశి.. ఆ రోజు ఏం చేస్తే మంచిదంటే..?
హైదరాబాద్ లో నెలకు రూ. లక్ష అద్దె చెల్లిస్తున్నాడు. అంటే అతగాడు నివసిస్తున్న ఇల్లు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. త్రీబుల్ బెడ్ రూం ప్లాట్ ని జిమ్ గా మార్చేసి నిత్యం ఫిట్ గా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు విచారణలో తెలింది. అంతేకాదు.. నెలకు రూ.10 వేలు ఇచ్చి.. వంట అమ్మాయిని సైతం పెట్టుకొన్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలే లక్ష్యంగా చేసుకొని చోరీ చేస్తున్న అతడి వేస్తున్న స్కెచ్ లకు పోలీసులే నిశ్చేష్టులయ్యారంటే అతగాడి పని తనం ఏ రేంజ్ లో ఉందో స్పష్టమవుతోంది.
Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
2013 నుంచి చోరీలు చేయడం ప్రారంభించిన బత్తుల ప్రభాకర్ స్వస్థలం చిత్తూరు జిల్లా. అతడు చోరీలు చేయడం ప్రారంభించిన తర్వాత... దాదాపు ఏడుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే జైల్లో ఉన్న సమయంలో తనను వేధించిన ఖైదీలను హత్య చేయాలని ప్లాన్ సైతం వేశాడు. అందుకోసం బిహార్ నుంచి మూడు గన్ లతోపాటు 300 బుల్లెట్లను సైతం కొనుగోలు చేసి తెప్పించుకొన్నాడు. ఇక అతగాడి శరీరంపై 3 అంకే, శిలువ గుర్తుతోపాటు 100 అని పచ్చ బొట్టు సైతం పొడిపించుకొన్నాడు. అందుకు 3 అంటే 333 కోట్లు సంపాదించడమని, అలాగే 100 అంటే అమ్మాయిలను అనుభవించడమని పోలీసుల విచారణలో అతడు పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు
అతడు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఖరీదైన విల్లాల్లో నివసిస్తాడు. ఓ వేళ పోలీసులు లేదా ఎవరికైనా అతడి వ్యవహార శైలిపై అనుమానం వస్తే.. వెంటనే ఇల్లు మార్చేస్తాడు. అదీకాక పోలీసుల తనిఖీల్లో అతడి నివాసంలో వందలాది బుల్లెట్లూ చూసి వారు అవాక్కయినట్లు సమాచారం. ఇక అతడు గన్ ఎలా కాల్చలనే విషయాన్ని సైతం సొంతంగా నేర్చుకొన్నాడు.
Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్
మరోవైపు 2020లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెను వదిలేశాడు. తాజాగా ఒడిశాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. ప్రిజం పబ్ లో కాల్పుల ఘటనను కొద్దిరోజుల ముందు ఆ యువతిని ఒడిశాకు పంపాడు. అయితే ఈ బత్తుల ప్రభాకర్ కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. ఇన్ని రకాలుగా చెడ్డ పనులు చేస్తూ.. అక్రమ సంపాదనతో దర్జాగా చలామణి అవుతోన్న అతడు జైలు నుంచి బయటకు వస్తే.. మళ్లీ పాత పంథానే అనుసరిస్తారనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
For Telangana News And Telugu News