Betting App Police Action: బెట్టింగ్ యాప్ కేసు.. వారే టార్గెట్‌గా పోలీసుల యాక్షన్
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:45 PM
Betting App Police Action: బెట్టింగ్ యాప్ కేసులో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ కేసులో (Betting App Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ల యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు చేపట్టారు. ఈ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వాహకులే టార్గెట్‌గా కొత్త సెక్షన్లు ప్రయోగిస్తున్నారు. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టనున్నారు. ఈ వ్యవహారంలో కోర్టులో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిని ఛార్జ్ షీట్‌లో సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బెట్టింగ్ యాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఓవైపు ఇన్ఫూయెన్సర్లను, యూట్యూబర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారి మీదనే కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా యాప్స్ ఓనర్స్‌పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా సుమారు 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో వివిధ రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీరంతా కూడా కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్స్‌కు యాజమానులుగా ఉన్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోయారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారిని మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్ ఓనర్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగానే ప్రమోటర్లను కాకుండా బెట్టింగ్ యాప్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు.
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల
ఇక.. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసి వారిని విచారణకు పిలిచి వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు పోలీసులు. ప్రమోటర్స్ స్టేట్‌మెంట్లనే కాకుండా బెట్టింగ్ యాప్స్ యాజమాన్యులను కూడా ఇందులో భాగస్వాములను చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ఫుయెన్సర్లను చార్జ్‌షీట్‌లో సాక్షులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బెట్టింగ్ ఇన్ఫుయెన్సర్లు, యూట్యూబర్ల చుట్టూ తిరిగి ఈ వ్యవహారం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఓనర్ల మెడకు చుట్టుకోబోతోంది.
ఇవి కూడా చదవండి...
Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..
Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం
Read Latest Telangana News And Telugu News