Share News

HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ

ABN , Publish Date - Apr 01 , 2025 | 09:38 AM

HCU Land Politics: హెచ్‌సీయూ భూముల వ్యవహారం నేపథ్యంలో వర్సిటీకి వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ
HCU Land Politics

హైదరాబాద్, ఏప్రిల్ 1: హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై (HCU land dispute) రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈరోజు (మంగళవారం) హెచ్‌సీయూకు వెళ్తామని ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్‌గూడ క్వాటర్స్‌ వద్ద పోలీసులు మోహరించారు. నేడు వర్సిటీకి వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం నిర్ణయించింది. హెచ్‌సీయూ భూముల వేలాన్ని బీజేపీ (BJP) వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. మరోవైపు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద కూడా బలగాలను మోహరించారు. అలాగే హెచ్‌సీయూ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు తరగతుల బహిష్కరణకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.


హెచ్‌సీయూ భూముల అమ్మకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం పార్టీ ఆధ్వర్వంలో హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు పిలుపునివ్వగా.. సీపీఐ పార్టీ మాత్రం దీనికి దూరంగా ఉంది. సీపీఐ అనుంబంధ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఖండించింది. కాంగ్రెస్ సర్కార్ ఆచీతూచి వ్యవహరించాలని, ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా రాబోయే తరాలకు ఏం మిగలదని.. దీనిపై సీఎం రేవంత్ పునరాలోచన చేయాలని, వెనక్కి తగ్గాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలో హైదర్‌గూడ క్వార్టర్స్‌ నుంచి హెచ్‌సీయూ వద్దకు వెళ్లి నిరసన చేయాలని నిర్ణయించింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక బృందంలా ఏర్పడి హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి హెచ్‌సీయూ భూముల వద్దకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అయితే ఎమ్మెల్యేలు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు పెద్దఎత్తున హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు మోహరించారు.

Sunita Williams: సునీత విలియమ్స్ తొలి పత్రికా సమావేశం.. భారత్‌పై ఆసక్తికర కామెంట్స్


ఇప్పటికే ఆ భూములు ప్రభుత్వానివే అంటూ టీజీఐఐసీ (TGIIC) ఆధారాలను బయటపెట్టింది. దీనికి సంబంధించి రెండు ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్‌సీయూ స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కార్.. 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను సీఎంవో విడుదల చేసింది. అయితే కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఖండించారు.


కంచగచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో ఒక అంగుళం కూడా హెచ్‌సీయూ భూమి లేదని, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తనదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తచేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి

Elon Musk: ఆష్లే‌పై మస్క్ సంచలన కామెంట్లు.. ఆ బిడ్డ నాదో కాదో తెలీదు..

Forbidden Google Searches: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. చిక్కుల్లో పడతారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 09:54 AM