Telangana Govt Key Decision: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:09 PM
Telangana Govt Key Decision: రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ బెట్టింగ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ అన్నారు.

హైదరాబాద్, మార్చి 26: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్, రమ్మీ కేసులు, చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ప్రకటన చేశారు. బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ బెట్టింగ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని నిర్ణయించామని.. కఠినమైన శిక్షల కోసం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. బెట్టింగ్ నేరస్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. నేరస్థులను కఠినంగా శిక్షించడానికి ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోందన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీకి ప్రచారం కల్పించినవారిని విచారించామని.. ప్రచారం చేసిన వారిని ప్రశ్నించడంతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటుతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
CM Chandrababu Orders: వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు
గతంలో వామన్ రావు దంపతులను నరికిచంపారని.. అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గత సర్కార్ హయాంలో దిశ ఘటన జరిగిందన్నారు. 2020 దేశంలో మహిళలపై జరిగిన ఘటనపై నాలుగో స్థానంలో తెలంగాణ ఉందన్నారు. జూబ్లీహిల్స్ పబ్‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో బీఆర్‌ఎస్ నేతల కొడుకులు ఉన్నారని తెలిసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగకుండా దురుద్దేశ్యంతో ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్వార్థం కోసం ప్రభుత్వం మీద.. అభివృద్ధి మీద యాసిడ్ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు మానుకోవాలని.. విజ్ఞతతో మాట్లాడాలని హితవుపలికారు. ప్రతిపక్షాలకు సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తెలంగాణను ఆదర్శంగా నిలపాలని చేస్తుంటే.. దురుద్దేశ్యంతో అడ్డుపడుతున్నారన్నారు. ధరల నియంత్రణలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. కడుపునిండా విషం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ కుటుంబంలో ఉండే పోటీ రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. వారు కోరుకున్నట్లు ఎన్నికలు రావన్నది గుర్తుంచుకోవాలని తెలిపారు. కేసీఆర్ వచ్చి కలిసినా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతానన్నారు. పద్మారావు , కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య వచ్చి కలిశారని.. మంచిని మంచి అంటాము.. చెడును చెడు అంటామని తెలిపారు. తమను బద్నాం చేస్తే మంచిది కాదన్నారు. ముసుగు తొడుక్కుని వ్యవరించవద్దంటూ హితవుపలికారు. ‘మేము వివక్ష చూపము.. ఉత్తత్తి బడ్జెట్.. ఊదరగొట్టే బడ్జెట్ మేముపెట్టలేదు. చేసిందే చెబుతాం.. చేసేదే చెబుతాం. గతంలో కాగితాల మీద బడ్జెట్ పెట్టారు. కాగ్ మొట్టికాయలు వేసినా వారు మారలేదు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YSRCP Corruption: ఆఖరికి కుక్కల తిండినీ వదలలేదుగా..
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News