Share News

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:50 PM

2004లో నాటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్రైవేటు సంస్థ‌కు ఈ భూమిని కేటాయించిందని, దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చ‌ట్ట‌ప‌రంగా గెల‌వ‌డం ద్వారా తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ భూమిపై యాజ‌మాన్యాన్ని ద‌క్కించుకుందని, ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాద‌మైనా కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుందని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Government Makes Key Announcement

హైదరాబాద్‌: హెచ్‌సీయూ (HCU) భూముల (Lands)పై బీజేపీ నేతల (BJP Leaders) విమర్శలతో (Comments) తెలంగాణ ప్రభుత్వం (Teangana Govt.) క్లారిటీ ఇచ్చింది. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 4 వందల ఎకరాల 400 acres) భూమి ప్రభుత్వానిదేనని ప్రాజెక్టులో హెచ్‌సీయూ భూమి లేదని ప్రభుత్వం తెలిపింది. మేమే భూ య‌జ‌మానులమని కోర్టు ద్వారా నిరూపించుకున్నామని, ప్రైవేట్‌ సంస్థకు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన‌ భూమిని.. న్యాయ‌ పోరాటంతో దక్కించుకున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వేలం, అభివృద్ధి ప‌నులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవని, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read..: మంత్రి నారా లోకేష్ 60వ రోజు ప్రజాదర్బార్


ముఖ్యాంశాలు...

2004లో నాటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్రైవేటు సంస్థ‌కు ఈ భూమిని కేటాయించిందని, దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చ‌ట్ట‌ప‌రంగా గెల‌వ‌డం ద్వారా తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ భూమిపై యాజ‌మాన్యాన్ని ద‌క్కించుకుందని, ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాద‌మైనా కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుందని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. స‌ర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ)ది కాద‌ని తేల్చింది. ఈ భూమిలో ప్ర‌భుత్వం చేప‌ట్టే అభివృద్ధి ప్ర‌ణాళిక‌లో ఏ చెరువు (లేక్‌) లేదని.. కొత్త‌గా చేప‌డుతున్న అభివృద్ధి ప్ర‌ణాళిక‌ అక్క‌డ ఉన్న రాళ్ల రూపాలను (Rocks formation) దెబ్బ‌తీయ‌దని తెలిపింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి ప్ర‌ణాళిక‌లో స్థానిక సుస్థిరాభివృద్ధి... ప‌ర్యావ‌ర‌ణ అవ‌స‌రాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్ర‌స్తుత ప్రాజెక్ట్ ను వ్య‌తిరేకించే వారంతా కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, స్థిరాస్తి వ్యాపారుల‌ (రియ‌ల్ ఎస్టేట్‌) ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.


నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ భూములకు సంబంధించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడింది. మరోైపు హెచ్‌సీయూలో విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. పోలీసుల ఆంక్షలపై విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆమరణ దీక్ష చేస్తామంటున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీయూలో పోలీసులు భారీగా మోహరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఓ వ్యక్తి హల్ చల్..

వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..

బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 01:50 PM