Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:34 AM
Youth Firing Gun: నగరంలో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. రోడ్డుపై కారును అతివేగంగా నడపడమే కాకుండా.. వారు చేసిన పనితో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్, మార్చి 28: అర్థరాత్రి ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. కారు వేగానికి ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతే కాకుండా కారులో ఉన్న వ్యక్తులు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు వణికిపోయారు. ఇంతకీ కారులోని వ్యక్తులు ఏం చేశారు.. అందుకు పోలీసుల రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బంజారాహిల్స్‌లో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. కారులో వెళ్తూ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. అది కూడా అతివేంగా కారును నడుపుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 26న కొందరు యువకులు కారులో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్‌లో బీభత్సం సృష్టించారు. ఓ యువకుడు అతివేగంగా కారును నడుపుతుండగా.. మరో యువకుడు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకీ శబ్ధం వినిపించడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు కారు ఎవరిది.. ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అలాగే కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడిపారా అనే దానిపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి కారు ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. కానీ కారుకు నెంబర్ ప్లేట్ లేదని తెలుస్తోంది. కారులో ఉన్న యువకులు 20 నుంచి 22 ఏళ్లు మధ్యలో ఉంటారని సమాచారం.
కాగా.. ఇలా రోడ్డుపై అతివేగంగా కారు నడపడమే కాకుండా.. గాల్లోకి కాల్పులు జరపడాన్ని పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆ యువకులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే రోడ్లపై ఇలాంటి చర్యలను సహించేది లేదని... కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
Rice: సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News