Share News

Ranganath: హైడ్రా పేరిట సెటిల్‌మెంట్లు చేస్తే కేసులు పెడతాం

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:42 AM

హైడ్రా పేరుతో ఎవరు సెటిల్‌మెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు.

Ranganath: హైడ్రా పేరిట సెటిల్‌మెంట్లు  చేస్తే కేసులు పెడతాం

  • అధికారులైతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం: రంగనాథ్‌

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): హైడ్రా పేరుతో ఎవరు సెటిల్‌మెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు. సెటిల్‌మెంట్లు చేసేవారిలో అధికారులు ఉంటే.. వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. వంశీరామ్‌ బిల్డర్స్‌పైన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఎవరికి ఫిర్యాదు చేశారో తనకు తెలియదని వెల్లడించారు.


అయితే ఆయన తనను కలిశారని, ఫిర్యాదు కాపీ తనకు వాట్సా్‌పలో పంపాలని సూచించానన్నారు. మ్యాన్‌హట్టన్‌, వంశీరామ్‌, ఆదిత్య, రాజ్‌పుష్ప వంటి నిర్మాణ సంస్థలు.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చెత్తను డంపింగ్‌ చేసినట్లుగా గుర్తించి.. తొలగించాలంటూ ఆదేశించామని చెప్పారు. తాము సెటిల్‌మెంట్లు చేసేది ఉంటే.. హైడ్రాకు ప్రజలు ఎందుకు భయపడతారని ప్రశ్నించారు.

Updated Date - Mar 25 , 2025 | 03:42 AM