Jagga Reddy: ఉగాది నాడు జగ్గారెడ్డి సినిమా ఆఫీసు ప్రారంభం
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:57 AM
సినిమా కార్యాలయాన్ని ఉగాది రోజున ప్రారంభించేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో కొత్తగా కార్యాలయం
వచ్చే ఏడాది ఉగాదికి విడుదల కానున్న సినిమా
‘విశ్రాంత్రి’కి ముందు సినిమాలో జగ్గారెడ్డి ఎంట్రీ
సినిమా పూర్తయ్యేవరకూ కొనసాగనున్న పాత్ర
హైదరాబాద్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా కార్యాలయాన్ని ఉగాది రోజున ప్రారంభించేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమాను నిర్మిస్తూ, అందులో నటిస్తున్న జగ్గారెడ్డి.. ఆ సినిమా నిర్మాణ పనులను ఈ కార్యాలయం నుంచే పర్యవేక్షించనున్నారు. ఈ సినిమా పోస్టర్‌కు భారీ స్పందన రావడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయని, రాజకీయ, సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోందని జగ్గారెడ్డి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది.
వచ్చే ఉగాది కల్లా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘జగ్గారెడ్డి- ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమాలో తన పాత్రకు, ప్రేమకు సంబంధమే ఉండదని జగ్గారెడ్డి వెల్లడించారు. తన పాత్ర విశాంత్రికి ముందు మొదలై.. సినిమా చివరి దాకా ఉంటుందన్నారు. ఈ సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. తాను విద్యార్థి నేత నుంచి కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎలా ఎదిగానన్నదీ.. ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు. లవ్, ఫ్యాక్షన్, ఎమోషనల్, పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News