Home » Jaggareddy
తనకు సంబంధించిన మూడు పాత్రల్లో మరొక యాక్టర్ నటిస్తాడని.. తర్వాత తాను ఎంటర్ అవుతానని చెప్పారు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతోనే సినిమా ఆద్యంతం రక్తి కట్టించేలా డైరెక్టర్ రామానుజం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.
45 ఏళ్ల క్రితం శ్రీరాముడి సేవలు ప్రారంభించిన జగ్గారెడ్డి, సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సంగారెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు
జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్న టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. ఆఫీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా కార్యాలయాన్ని ఉగాది రోజున ప్రారంభించేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన తన ఢిల్లీ టూర్.. తనను పూర్తిగా మార్చేసిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు. తాను సినిమా రంగంలోకి వెళ్లేందుకు ఈ టూర్ పనికొచ్చిందన్నారు.
హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు.
రాజకీయ రంగంలో రాణించిన తూర్పు జగ్గారెడ్డి.. సినీ రంగంలోనూ ఆరంగేట్రం చేస్తున్నారు. ‘జగ్గారెడ్డి.. ఎ వార్ ఆఫ్ లవ్’ అనే సినిమాలో.. తన నిజ జీవిత పాత్రనే పోషించనున్నారు. జగ్గారెడ్డి తొలి సినిమానే పాన్ ఇండియా రేంజ్లో నిర్మాణం కాబోతోంది.
Jaggareddy in Films: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు వెళ్లిన ఆయన ఓ కీలక విషయాన్ని తెలియజేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2017లో సంగారెడ్డిలో తాను రాహుల్‌గాంధీ సభను భారీ ఎత్తున నిర్వహించానని, ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంత కష్టపడిందీ వివరించేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.
‘‘ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పోలేదంటూ హరీశ్‌రావు మాట్లాడుతున్నడు. కొండగట్టు ప్రమాదంలో 65 మంది, మాసాయిపేట రైలు ప్రమాదంలో 25 మంది చిన్నారులు చనిపోతే.. కనీసం చూసేందుకైనా కేసీఆర్ వెళ్లలేదు.