Share News

Kancherla Raghu: ఈఆర్‌సీ సభ్యునిగా కంచర్ల రఘు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:30 AM

తెలంగాణ విద్యుత్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) చైౖర్మన్‌ కంచర్ల రఘుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆయనను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) సభ్యుని (టెక్నికల్‌)గా నియమించింది.

Kancherla Raghu: ఈఆర్‌సీ సభ్యునిగా కంచర్ల రఘు

  • మరో మెంబర్‌గా చెరుకూరి శ్రీనివాసరావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) చైౖర్మన్‌ కంచర్ల రఘుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆయనను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) సభ్యుని (టెక్నికల్‌)గా నియమించింది. ఈ మేరకు సోమవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. రఘు ఈ పదవిలో ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్లు నిండే దాకా ఏదీ ముందైతే... అప్పటిదాకా ఉండనున్నారు. రఘుతో పాటు మరో సభ్యునిగా (ఫైనాన్స్‌)గా చెరుకూరి శ్రీనివాసరావును నియమించారు.


దక్షిణ డిస్కమ్‌లో డైరెక్టర్‌గా చేరిన శ్రీనివాసరావు... కాలక్రమంలో ట్రాన్స్‌కోలో జేఎండీగా చాలా కాలం పాటు పనిచేశారు. రఘు 1990లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ)గా కెరీర్‌ను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేళ్లకాలంలో విద్యుత్‌ రంగంలో నష్టాలు చేసే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)కు వ్యతిరేకంగా ఉద్యమించారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 04:30 AM