ఆర్‌జీ-1లో 98శాతం బొగ్గు ఉత్పత్తి
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:40 AM
డిసెంబర్‌లో ఆర్‌జీ-1 ఏరియాలో 98శాతం బొగ్గు ఉత్పత్తిని సాధిం చినట్టు ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ చెప్పారు.
గోదావరిఖని, జనవరి 1(ఆంధ్రజ్యోతి): డిసెంబర్‌లో ఆర్‌జీ-1 ఏరియాలో 98శాతం బొగ్గు ఉత్పత్తిని సాధిం చినట్టు ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ చెప్పారు. బుధ వారం ఆర్‌సీవోఏ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4.51లక్షల టన్ను ల బొగ్గు ఉత్పత్తికి గాను 4.41లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 98శాతం లక్ష్యాన్ని చేధించిందన్నారు. ఇందు లో జీడీకే ఓసీపీ-5 106శాతం, జీడీకే 11ఇంక్లైన్ 89 శాతం, జీడీకే 2,2ఏ ఇంక్లైన్ 44శాతం, జీడీకే 1,3ఇంక్లైన్ 56శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు. డిసెంబర్ వరకు వార్షిక లక్ష్యం 36.56లక్షల టన్నులకు గాను 32.98లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 90 శాతం లక్ష్యాన్ని చేధించినట్టు చెప్పారు. జీడీకే ఓసీపీ-5 లో పర్యావరణం కోసం డీజీఎంఎస్ నిబంధనలకు అనుగుణంగా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నామని, గత వారం రోజులుగా బ్లాస్టింగ్ తీవ్రత పెరిగిందని తన దృష్టికి వచ్చిందని, దీనిపై అధికారులతో సమీక్షించి బ్లాస్టింగ్ తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సీఎస్‌పీ-1 వద్ద నిత్యం దుమ్ము లేస్తుండడం తో దాని నివారణ కోసం రూ.2 కోట్ల వ్యయంతో స్ల్పింక్ల ర్లను ఏర్పాటుచేస్తున్నట్టు, 15రోజుల్లో వీటిని అందుబా టులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రస్తుతం టెండర్ అయిపోవడంతో తామే రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి దుమ్ము లేవకుండా నీటిని స్ర్పే చేయిస్తున్నామని తెలి పారు. దుమ్ముతో సీఎస్‌పీ కాలనీ, బాపూజీనగర్, జీఎం కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని, దీని నివారణ కోసం త్వరలో చర్య లు చేపట్టనున్నట్టు తెలిపారు. కర్ణాటకలోని ఎన్‌టీపీసీ కుడికి ప్రాజెక్టుకు వెళ్లే బొగ్గు నాణ్యతపై దృష్టి సారించి నట్టు, అందులో నాసిరకం బొగ్గును రవాణా చేస్తున్న ట్టు వస్తున్న ఆరోపణలు నిజం కాదని, సీఎస్‌పీ నుంచి బొగ్గు రవాణా అయిన తరువాత ఎన్‌టీపీసీ యాజమా న్యానికే సంబంధం ఉంటుందని, వారే ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా చేసుకుంటున్నారని చెప్పారు. ఉద్యో గులు, అధికారుల సమష్టి కృషితోనే ఆర్‌జీ-1లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. కార్మికులు, ఉద్యోగులకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు జీఎం తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌వోటూ జీఎం గోపాల్‌సింగ్, ఏరియా ఇంజనీర్ వెంకటేశ్వర్‌రావు, ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, ఏజెంట్ చిలుక శ్రీని వాస్, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్‌సెక్రటరీ ఆరెల్లి పోషం తదితరులు పాల్గొన్నారు.