Share News

పదవీ విరమణ పొందిన అధికారికి సన్మానం

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:37 AM

ఆర్‌జీ-1 ఏరియాలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందు తున్న డీజీఎం(క్వాలిటీ) కే అమరేందర్‌రెడ్డిని ఆర్‌జీ-1 జీ ఎం కార్యాలయంలో జీఎం లలిత్‌ కుమార్‌ పూలమాలలు, శాలువాలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు.

పదవీ విరమణ పొందిన అధికారికి సన్మానం

గోదావరిఖని, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1 ఏరియాలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందు తున్న డీజీఎం(క్వాలిటీ) కే అమరేందర్‌రెడ్డిని ఆర్‌జీ-1 జీ ఎం కార్యాలయంలో జీఎం లలిత్‌ కుమార్‌ పూలమాలలు, శాలువాలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అమరేందర్‌ క్రమశిక్షణతో, స్నేహపూర్వకంగా మెదిలి అంద రి మన్ననలను పొందారనిన్నారు. పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతిఒక్కరూ పదవీ విరమణ పొందుతార ని, వారి భావిజీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం వివిధ డిపార్ట్‌మెంట్ల అధి కారులు, కుటుంబసభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమం లో జీఎం(క్వాలిటీ) బైద్య, ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌సింగ్‌, ఏరియా ఇంజనీర్‌ డీవీరావు, సీఎంఓఐ ప్రతినిధి క్రాంతి, ఏఐటీయూసీ ప్రతినిధి రాజు, డీజీఎం క్వాలిటీ సాయి ప్రసాద్‌, పర్సనల్‌ మేనేజర్‌ రవీందర్‌ రెడ్డి, సీనియర్‌ పీవో హనుమంతరావు, అధికా రులు శ్రీధర్‌, బీమా, వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:37 AM