Share News

సీజన్‌ ప్రారంభంలోనే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:24 AM

జగిత్యాల జిల్లాలో మామిడి రైతులకు దిగులు మొదలైంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మామిడి పూత రాకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో పచ్చి పూత దశలో ఉండడం, ఇంకొన్ని ప్రాంతాల్లో పూత రాలుతుండడం వంటివి చోటుచేసుకు న్నాయని రైతులు అంటున్నారు.

సీజన్‌ ప్రారంభంలోనే..

మామిడి రైతుల్లో దిగులు..

చెట్లకు నామమాత్రపు పూత

ప్రతీ సీజన్‌లో తప్పని తిప్పలు

వాతావరణంలో మార్పులే కారణమంటున్న అధికారులు

తగ్గనున్న దిగుబడిపై అన్నదాతల దిగులు

రాష్ట్రంలో 2.90 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగు

===================

జగిత్యాల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో మామిడి రైతులకు దిగులు మొదలైంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మామిడి పూత రాకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో పచ్చి పూత దశలో ఉండడం, ఇంకొన్ని ప్రాంతాల్లో పూత రాలుతుండడం వంటివి చోటుచేసుకు న్నాయని రైతులు అంటున్నారు. పూత ఆల స్యంగా రావడం, రాలుతుండడం కారణంగా దిగుబడి తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. పూత వస్తుందన్న ఆలోచనతో రైతులు ముందుగానే రసాయన మందు పిచికారి చేశారు. అయినా కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, వాతావరణంలో అనూహ్యమార్పలు చోటుచేసుకోవడంతో మామిడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మామిడిని అధికంగా సాగు చేసే జిల్లాల సరసన జగిత్యాల జిల్లా ఉంటుంది. జగిత్యాల జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా రైతులు మామిడిని సాగు చేస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ప్రతీ సీజన్‌లోనూ ఇలాంటి కష్టాలు తప్పకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగు....

రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో 2.91 లక్షల ఎకరాలకు పైగా రైతులు మామిడి సాగు చేస్తున్నారు. సుమారు 55 వేల ఎకరాల్లో సాగు చేస్తూ జగిత్యాల జిల్లా మామిడి స్థానంలో రెండవ స్థానంలో ఉంది. పెట్టుబడి ఖర్చులు భరించే స్థోమత ఉన్న రైతులు సొంతంగా మామిడి తోటలను నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బం ది ఉన్న వారు తోటలు పూత రావడానికి ముందే లీజుకు ఇస్తున్నారు. ఈ సారి పూత ఆలస్యంగా వస్తుం డడంతో అటు రైతులు, ఇటు లీజు దారులు ఆం దోళనకు గురవుతున్నారు. ఈసారి ఏకరాకు 3 నుంచి 3.5 టన్నుల వరకు దిగుబడి రావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి విపరీతంగా పడిపోతూ వస్తుండటం, మార్కెటింగ్‌ సమస్యల వంటి కారణాలతో మామిడి తోటల వల్ల లాభం లేదని రైతాంగం భావిస్తోంది. పెట్టుబడి ఖర్చులు వస్తాయోలేదోనని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. రెండు, మూడు సంవత్సరాలుగా మామిడికి పూత సరిగా రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం వల్ల రైతులకు ఆశించిన దిగుబడి రావడం లేదు.

కలిసి రాని వాతావరణ పరిస్థితులు...

మామిడి పూత సాధారణంగా నవంబర్‌ చివరి వారం నుంచి ప్రారంభమై డిసెంబరు, జనవరి మొదటి, రెండవ వారం వరకు వస్తుంటుంది. మామిడిలో 8 నెలల పాటు చేపట్టే యాజాన్య పద్ధతులలో పూత నుంచి కోత వరకు నాలుగు నెలలు చేపట్టే యాజమాన్యం పద్ధతి కీలకంగా ఉంటుంది. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ. 15 వేల విలువైన రసాయన మందులు పిచికారి చేశారు. సెప్టెంబరు, అక్టోబరు మాసాలలో సైతం వర్షాలు పడడంతో భూమి తేమతో కూడి ఉంటోంది. దీనికి తోడు వాతావరణంలో మార్పులు ఏర్పడి పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం ఉండడం సైతం పూతపై ప్రభావం చూ పుతోంది. పూత విచ్చుకునే దశలో చలి ప్రభావంతో పొడి వాతావరణం ఉండడం లేదు. జనవరి మొదటి వారంలో సైతం పూత ఆశించిన మేరకు రాకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

దిగుబడిపై దిగులు...

మామిడి పంటకు తెగుళ్లు సోకడం వల్ల మున్ముందు మామిడి కాయల దిగుబడి తగ్గుతుందన్న ఆందోళనలో రైతాంగం ఉంది. జగిత్యాల జిల్లాలో ప్రతీ యేటా సు మారు రూ. 400 కోట్ల మామిడి వ్యాపారం జరుగు తుంటుంది. ఇక్కడ నుంచి మామిడి కాయలను ముం బాయి, బెంగుళూరు, చెన్నయి, ఢిల్లీ తదితర ప్రాంతా లకు ఎగుమతి చేస్తారు. అనేక వ్యయప్రయాలసకోర్చి మామిడిని మార్కెట్‌ను తీసుకెళ్తే గిట్టుబాటు ధర లభించని పరిస్థితిని రైతాంగం ఎదుర్కొంటున్నది. మామిడికి మద్దతు ధరను ప్రకటించమని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

వాతావరణ మార్పులతోనే దిగుబడిపై ప్రభావం

- జంగిటి రాజేందర్‌, మామిడి రైతు, బండలింగాపూర్‌, జగిత్యాల జిల్లా

ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా పూత, కాతపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందాల్సి వస్తోంది. ముందుగా పూతకు వచ్చిన తోటలకు పెద్దగా ఇబ్బందులేమి లేకపోగా, పూత ఆలస్యంగా వచ్చిన తోటల్లో మాత్రం దిగుబడిపై ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి.

జాగ్రత్తలు తీసుకుంటే మేలు

- స్వాతి, ఉద్యానవన పంటల శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, పొలాస, జగిత్యాల జిల్లా

మామిడి చెట్లకు ప్రస్తుత సమయంలో పూత ఆలస్యంగా వస్తోంది. వారం రోజుల క్రితం వరకు వాతావరణంలో చల్లదనం ఉండడం వల్ల రాలేదు. ఇప్పటికే సగానికి పైగా పూత రావాల్సి ఉంది. పూత ఇప్పటివరకు రానట్లయితే పొటాషియం నైట్రేట్‌ అనే రసాయనాన్ని పిచికారి చేయాలి. కొత్త పూత వస్తున్నప్పుడు తేమ మంచు పురుగును గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంక్రాంతిలోపు పూత వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 05 , 2025 | 01:24 AM