చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:17 AM
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని జిల్లా నెహ్రూ యువ కేంద్రం అధికారి రాంబాబాబు అన్నారు.
సుల్తానాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని జిల్లా నెహ్రూ యువ కేంద్రం అధికారి రాంబాబాబు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ బ్యాడ్మింటన్ పోటీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవంలో రాంబాబు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలు మానసి క ప్రశాంతతను నెలకొల్పుతాయని అన్నారు. ఈ పోటీలలో వాలీవాల్‌లో సుల్తానాబాద్ జట్టు ప్రథమ బహుమతిని, సుల్తాన్‌పూర్ జట్టు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీల్లో పొత్కపల్లి జట్టు ప్రథమ, సుల్తానాబాద్ జట్టు ద్వితీయ బహుతులు పొందాయి. షటిల్ బ్యాడ్మింటి న్, రన్నింగ్, షాట్‌ఫుట్ విజేతలుగా నిలిచిన విజేతలకు నాలుగు వేల రూపాయల స్పోర్ట్స్ కిట్‌తోపాటు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ముస్తాల రవీందర్, అమిరిశెట్టి తిరు పతి, ఏజీపీ దూడెం అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.