ఆస్తుల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:42 AM
ఆస్తుల పరిరక్షణలో అప్రమ త్తంగా ఉండాలని ఆర్జీ-2 జీఎం వెంకటయ్య అన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల పరిరక్షణలో అప్రమ త్తంగా ఉండాలని ఆర్జీ-2 జీఎం వెంకటయ్య అన్నారు. బుధవారం సెక్యూరిటీ విభాగం డిస్ట్రిబ్యుషన్ పాయింట్ వద్ద సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమయ్యా రు. సిబ్బంది విధులు, క్రమశిక్షణ, ఆస్తుల పరిరక్షణ విషయాలపై జీఎం సిబ్బం దికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టుల వద్ద కోల్ ట్రాన్స్‌పోర్టు, సీహెచ్‌పీ వద్ద గనుల వద్ద చెక్‌పోస్టుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓసీపీ-3 ప్రాజె క్టు, స్టోర్‌వంటి వాటిలో చోరీలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఏదైనా యంత్ర భాగాలు, కేబుల్ వంటివి అపహరణకు గురైతే యంత్రాలు నిలి చిపోయి ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ఈసమావేశంలో ఎస్వో టూ జీఎం రాముడు, ఎస్‌ఎస్‌ఓ షరీఫ్‌మహమ్మద్, జమెదార్లు సంపత్, విజయ్ కుమార్, అబ్దుల్ మజీద్‌తో పాటు ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.