Share News

ఘనంగా భోగి సంబరాలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:18 AM

గోదావరి ఖనిలో భోగి వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఇళ్ల ముందు రం గురంగుల ముగ్గులను వేశారు. ఆవుపేడతో తయారు చేసిన గొబ్బె మ్మలు, నవ ధాన్యాలు, రేగుపం డ్లు, పలు రకాల పూలతో అలంకరించా రు.

 ఘనంగా భోగి సంబరాలు
సుల్తానాబాద్‌ గాంధీనగర్‌లో భోగిమంటల వేడుకలలో పాల్గొన్న ప్రజలు

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): గోదావరి ఖనిలో భోగి వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఇళ్ల ముందు రం గురంగుల ముగ్గులను వేశారు. ఆవుపేడతో తయారు చేసిన గొబ్బె మ్మలు, నవ ధాన్యాలు, రేగుపం డ్లు, పలు రకాల పూలతో అలంకరించా రు. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌, పరు శరాంనగర్‌, రాజలక్ష్మికాలనీ తదితర కాలనీల్లో భోగి వేడుకలను నిర్వహిం చారు. కాలనీల్లో మహిళలు భోగి మంటలు వేశారు. మంగళవారం మకర సంక్రాంతి, బుధ వారం కనుమ వేడుకలు నిర్వహించనున్నారు.

సుల్తానాబాద్‌: పట్టణంలోని గాంధీనగర్‌ లో కౌన్సిలర్‌ అనుమల అరుణ బాబురావు దంప తుల ఆధ్వర్యంలో భోగి సంబరాలను నిర్వహిం చారు. గాంధీ విగ్రహం చౌరస్తా ప్రాంతమంతా రంగురంగు ల ము గ్గులతో ముస్తాబు చేసి భోగి మంట లను వెలిగించారు. మహిళలు కోలా టాలు నృత్యాలు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ప్రదర్శించా రు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వాకర్స్‌ అసోసియోషన్‌ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహిం చా రు. స్థానిక సుభాష్‌నగర్‌లో అంబేద్క ర్‌ సంఘం అధ్యక్షుడు అరేపల్లి రాహుల్‌ ఆధ్వర్యంలో భోగి మంటల ను వేశారు.

జూలపల్లి: మండలంలోని వడుకాపూర్‌ గ్రామంతో పాటు ఆయా గ్రామాల్లోని రైతులు గోదల పండుగ (ఎద్దులు)ను నిర్వహించా రు. వడుకాపూర్‌ గ్రామ శివారులో గోదాదేవి రంగనాయక స్వాముల వారల విగ్రహాలను మరియు ఎద్దుల విగ్రహాలను మట్టి ప్రతిమలను తయారుచేసి వాటిని పచ్చనితోర ణాల పందిట్లో ఆసీనులను చేసిన రైతులు వాటికి ప్రత్యేకపూజలు చేశా రు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మామిడి తోరణాల కింద నుంచి పశువులను సాగనం పారు. కార్యక్రమంలో రైతులు మొగురం అశోక్‌, లచ్చయ్య, ఎంకటయ్య, అంజయ్య, మహేష్‌, జగదీష్‌, ఎల్లయ్య, రంగు రాములు, మొగురం ఈదులకంటి నాగేష్‌, పాక ప్రభాకర్‌, పిట్టల రాజు, మొ దుంపల్లి లచ్చయ్య తదితరు లు పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌: మండలం లోని గుండారం, రాజాపూర్‌, జూలపల్లి, పీరాపల్లి, రొంపికుంట, పెంచిక ల్‌పేట, నాగారం, సిద్దిపల్లె గ్రామాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులను వేశారు. భోగి మంటలను వేసి వేడుకలను జరుపుకున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 01:18 AM