Share News

ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణాలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:21 AM

నగరంలోని పలు ఆలయాల్లో ధనుర్మాసోత్సవాఓ్ల భాగంగా సోమవారం గోదా రంగనాథస్వామి కల్యాణాలను కన్నులపండువలా నిర్వహించారు. యజ్ఞవరాహక్షేత్రంలో జరిగిన కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది.

ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణాలు

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని పలు ఆలయాల్లో ధనుర్మాసోత్సవాఓ్ల భాగంగా సోమవారం గోదా రంగనాథస్వామి కల్యాణాలను కన్నులపండువలా నిర్వహించారు. యజ్ఞవరాహక్షేత్రంలో జరిగిన కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్వవైదికసంస్థానంట్రస్టు ఉప కులపతి శ్రీభాష్యం వరప్రసాద్‌, సభ్యులు, తిరుప్పావై, శ్రీవచన భూషణం ప్రవచనం చేస్తున్న ప్రముఖ పండితుడు సాతులూరిగోపాలకృష్ణమాచార్య స్వామి, స్థానిక ఉభయ వేదాంత పండితులు, శ్రీవైష్ణవ ద్విజులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరాలయంలో జరిగిన కల్యాణంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈఓ కందుల సుధాకర్‌, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 01:21 AM