Share News

ప్రతిపక్షాల ఆరోపణలకు అభివృద్ధే సమాధానం

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:36 AM

రామగుండం లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాము చేస్తున్న అభివృద్ధే జవాబు అని, పనులు మొదలయ్యాయని, ఆరు నెలల్లో మార్పు ఏమిటో స్పష్టంగా క్షేత్రస్థాయి కని పించనున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణలకు అభివృద్ధే సమాధానం

గోదావరిఖని, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రామగుండం లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాము చేస్తున్న అభివృద్ధే జవాబు అని, పనులు మొదలయ్యాయని, ఆరు నెలల్లో మార్పు ఏమిటో స్పష్టంగా క్షేత్రస్థాయి కని పించనున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులకు రామగుండంలో చేస్తున్న అభివృద్ధి పనులు కనిపించ డం లేదని, వారిని కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తా నన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఏడాదిలో రూ.300కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు, కార్పొరే షన్‌ పరిధిలో 50డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ పనులు జరు గుతున్నాయని, రామగుండంలో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 3/800 2400మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు, రామగుం డంలో 800మెగావాట్ల విద్యుత్‌ కేంద్రంను తీసుకురాను న్నట్టు చెప్పారు. మెడికల్‌ కళాశాల తాము తీసుకువ చ్చామంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు గొప్పలు చెబుతు న్నారని, సింగరేణి కార్మికుల చెమట చుక్కల సొమ్ము తోనే మెడికల్‌ కళాశాల నిర్మాణం జరిగిందని, ప్రభు త్వం రూపాయి ఇవ్వలేదన్నారు. రామగుండానికి ఈ ఎస్‌ఐ ఆసుపత్రి అప్పటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లనే వెన కకు వెళ్లిపోయిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి మళ్లీ మంజూరు చేయించామని, రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. రామ గుండంలో 350కోట్లతో పాలకుర్తి ఎత్తిపోతలను ప్రతిపా దించామని, దీని వలన ఉమ్మడి రామగుండం మండ లంతో పాటు కమాన్‌పూర్‌, పెద్దపల్లి మండలాల్లో కొన్ని ప్రాంతాలకు మూడు పంటలకు నీరందే అవకాశం ఉందన్నారు. బండలవాగు ప్రాజెక్టు పూర్తి కావచ్చిందని, త్వరలోనే ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి చేతు ల మీదుగా కానీ ప్రారంభిస్తామన్నారు. సుందిళ్ల బ్యారే జీలో నీటి నిల్వలు ఉంచి ప్రపంచానికి కాళేశ్వరంతో నీళ్లు తెచ్చామని చూపేందుకు గత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని, దీంతో భారీ వరదలకు గోదావరిఖని, మంచిర్యాల మునిగాయన్నారు. గతంలో కరకట్ట ప్రతి పాదనలే లేవని, దీని పట్ల దుష్ప్రచారం చేశారన్నారు. గతంలో పని చేసిన ఇంజనీర్లే ఇప్పుడు ఇరిగేషన్‌లో ఉన్నారని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను వర్షాకాలంలో తగ్గించుకుంటే కరకట్టలు అవసరం లేదని చెబుతున్నా రన్నారు. మంచిర్యాల, చెన్నూరుల్లో కరకట్టలు కడితే రామగుండంలో కడతారన్నారు. రామగుండంలో కబ్జా అయిన సింగరేణి భూములను విడిపించి షాపింగ్‌ కాంప్లెక్స్‌లు కడదామని ప్రయత్నిస్తుంటే విపక్ష నాయ కులు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని, రామగుండం లో సింగరేణి ఆధ్వర్యంలో షాపింగ్‌ మాల్‌, జేఎన్‌టీ యూ నుంచి ఫోర్‌ లైన్‌ రోడ్డు, రామగుండంలో ఫ్లై ఓవర్‌పై కుడివైపు రైట్‌ ఆర్మ్‌ వంతెన నిర్మాణం చేయ నున్నామన్నారు. తద్వారా నగరంలో వ్యాపారం అభి వృద్ధి చేయడం ద్వారా ఉపాధి కలుగనున్నదన్నారు. మంచిర్యాల, సిద్ధిపేటలను చూసి అయినా ఇక్కడి ప్రతి పక్షాలు నోరుమూసుకోవాలన్నారు. రామగుండంలో చెప్పని పనులను చేసి చూపించామని, రాబోయే రోజు ల్లో కూడా అదే విధానం కొనసాగుతుందన్నారు. రామ గుండం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రామగుండం లో డెంటల్‌ కళాశాలను కూడా తీసుకురానున్నామ న్నారు. తద్వారా ఈ ప్రాంతాన్ని మెడికల్‌ హబ్‌గా మారుస్తామని, ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగి ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, కొలిపాక సుజా త, మారెల్లి రాజిరెడ్డి, ఎం రవికుమార్‌, తిప్పారపు శ్రీని వాస్‌, ముస్తాఫా, దీటి బాలరాజు, గుండేటి రాజేష్‌, గడ్డం శ్రీనివాస్‌, ఫజల్‌ బేగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:36 AM