జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:04 AM
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఆవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రఘచంద ర్, సీఐ వేణుగోపాల్‌లతో పాటు పోలీస్ సిబ్బంది జగిత్యాల పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వ హించారు.
- విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
- 92 కేసులు నమోదు
జగిత్యాల క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఆవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రఘచంద ర్, సీఐ వేణుగోపాల్‌లతో పాటు పోలీస్ సిబ్బంది జగిత్యాల పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వ హించారు. కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, గొల్లపెల్లి రోడ్, బైపాస్ రోడ్, మంచినీళ్ల బావి, ప్రధాన చౌరస్తా లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దీంతో పాటు మెట్‌పెల్లి, ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల రూరల్, మల్యాల సర్కిల్ పరిధిలో పోలీస్ అధికారులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించా రు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 92 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పెగడపెల్లిలో 13 కేసులు నమోదయ్యాయి. ధర్మపురిలో 12, గొల్లప ల్లి, జగిత్యాల ట్రాఫిక్, మల్యాల, కథలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది కేసుల చొప్పున నమోద య్యాయి. వెల్గటూర్, రాయికల్‌లో ఐదు చొప్పున, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాలుగు కేసుల చొప్పున, సారంగాపూర్, మెట్‌పెల్లి, జగిత్యాలటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కేసుల చొప్పున, కొడిమ్యాల, బుగ్గారం పోలీస్‌స్టేషన్ల పరిధి లో ఒక్కో కేసు నమోదైనట్లు ఎస్పీ అశోక్‌కుమార్ వివరించారు.
మల్యాల: మల్యాలలో మంగళవారం అర్ధరాత్రి పో లీసులు నిర్వహించిన డ్రంక్ ఆండ్ డ్రైవ్ పరీక్షలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. వారి వద్ద ద్విచక్రవాహనా లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళ వారం అర్ధరాత్రి నుంచి సీఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్సై నరేశ్‌కుమార్, పోలీసులు పర్యవేక్షించారు.
- నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మండ లంలోని సర్వాపూర్‌లో మంగళవారం రాత్రి ఘర్షణ జ రిగింది. కొందరు వ్యక్తులు గొడవపడగా పలువురిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.
కోరుట్ల: పట్టణంలోని నూతన సంవ్సతరం పురస్క రించుకొని మంగళవారం రాత్రి పోలీసులు బందోబ స్తును నిర్వహించారు. కోరుట్ల సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో కోరుట్ల ఎస్‌ఐలు శ్రీకాంత్, రామచంద్రు డు తన సిబ్బందితో వాహనాల తనిఖీని నిర్వహించా రు. పట్టణంలోని నందీ, కార్గిల్ చౌరాస్తాలతో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 20 మంది మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీ సులు గుర్తించారు. ధ్రువీకరణ ప్రతాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లేని 25 వాహన యజమానులపై కేసు నమో దు చేసినట్లు పోలీసు తెలిపారు. మాదాపూర్ శివారులో జరిగిన కత్తిపోటు ఘటనలో ఇద్దరిపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.