Share News

పరిపాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:31 AM

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేక, అభివృద్ధిని ముందుకు నడిపించక, అనతికాలంలోనే ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

పరిపాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేక, అభివృద్ధిని ముందుకు నడిపించక, అనతికాలంలోనే ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ మేథోమదన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తెలంగాణను శిథిలం చేసిందని ఆయన విమర్శించారు. పరిపాలనను పక్కనపెట్టి ప్రతీకార పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ, చేయని తప్పునకు కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా లేదని, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన వనరులను ఉపయోగించుకోవాలన్నారు. అంతే కాకుండా కుటుంబ ఆర్థిక భద్రత కోసం వ్యక్తిగత ఇన్స్యూరెన్స్‌లు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు దాసరి ఉష, పలువురు ఇన్స్యూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 01:31 AM