Share News

ఘనంగా వైకుంఠ ఏకాదశి..

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:17 AM

పెద్దపల్లి మండలం పెద్దకల్వల క్యాంపులోని శ్రీఅలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి.

ఘనంగా వైకుంఠ ఏకాదశి..

పెద్దపల్లి రూరల్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలం పెద్దకల్వల క్యాంపులోని శ్రీఅలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. కలె క్టర్‌ శ్రీకోయ శ్రీహర్ష సతీసమేతంగా స్వామివారిని దర్శిం చుకున్నారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్‌ బొంకూరి శంకర్‌, ప్రధాన అర్చకులు రంగాచార్యులు, కమిటీ సభ్యులు భక్తులు వైకుంఠ ఏకాదశి సేవ జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్‌, కోటగిరి శ్రీకాంత్‌, రాజ్‌కుమార్‌, సురేష్‌, రాజప్ర సాద్‌, శివ ప్రసాద్‌, రాకేష్‌ పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : సుల్తానాబాద్‌ లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడా యి. వేణుగోపాలస్వామి ఆలయంలో తిరుప్పావై పాశురాల నివేదన అనంతరం మూలస్వామికి విశేష అలంకరణలు చేశారు. ఉత్సవ మూర్తుల తో ఆలయం ఆవరణలో శోభాయాత్ర నిర్వహిం చారు. ఆలయ చైర్మన్‌ పల్లా సదాలక్ష్మి మురళి, సౌమిత్రి వెంకటచారి వసుధ, శ్రా వణ్‌ కుమార్‌ హరిణి, సాదుల సునిత సుగుణాకర్‌ పాల్గొన్నారు. నీరుకుళ్ల భూనీళా సమేత రంగనాయక స్వామి ఆల యంలో వేడుక లు వైభవంగా జరిగాయి. స్వామి వారికి భక్తు లు సంకీర్తనలు భజన లు చేశారు. అనంతరం స్వామివారిని మాఢ వీదుల్లో ఊరేగించారు. అనం తరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేశారు. అలాగే మండలంలోని చిన్నకలువల, సుద్దాల, కనుకుల, రాము నిపల్లి, గర్రెపల్లి, బొంతకుంట పల్లి, ఐతరాజుపల్లి గ్రామాల్లో వేడుకలు జరుపుకున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 01:17 AM