Share News

అవనిపై విరిసిన హరివిల్లు..

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:22 AM

ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ము గ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’.. స్థానిక పార్టనర్‌ అల్ఫోర్స్‌ హైస్కూల్‌ సుల్తానాబాద్‌, అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వి నరేందర్‌రెడ్డి సహకారంతో శుక్రవారం నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది.

అవనిపై విరిసిన హరివిల్లు..

- ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన

- సంక్రాంతి పండుగను ప్రతిబింబించిన ముగ్గులు..

సుల్తానాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ము గ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’.. స్థానిక పార్టనర్‌ అల్ఫోర్స్‌ హైస్కూల్‌ సుల్తానాబాద్‌, అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వి నరేందర్‌రెడ్డి సహకారంతో శుక్రవారం నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ అల్ఫోర్స్‌ హై స్కూల్‌ ఆవరణలో నిర్వహిం చారు. ఆకాశంలో పరుచుకునే హరివిల్లు అవనిపై విరిసి నట్లుగా.. సంక్రాంతి పండుగ నేపథ్యం.. రంగు రంగుల చు క్కల ముగ్గులు. గొబ్బె మ్మలు, పాల పొంగు, భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగి రెద్దుల విన్యాసాలు.. తెలం గాణ సంస్కృతి సంప్రదా యాలు ప్రతిబింభించే విధంగా, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. భ్రూణ హత్యలను నివా రించాలనే సందేశాలతో మహిళలు వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు పెద్దపల్లి, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్‌, జూల పల్లి, సుల్తా నాబాద్‌, గోదావరిఖని, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి 92 మంది మహిళలు, యువతులు హాజరై ఉత్సాహంగా ముగ్గులు వేశారు.

సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలి..

ఫ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

తెలంగాణ అంటేనే సం స్కృతి సంప్రదాయాలకు నిల యంగా దేశంలో పేరుందని, వీటిని పరి రక్షించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. ముగ్గుల పోటీ ము గింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పు డు సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో చాలామంది ముగ్గులు వేసేవారని, ఆ తర్వాత పట్టణాల్లో వేయడం ప్రారం భమైందని, ఈతరం అమ్మా యిలకు ముగ్గుల ప్రాశస్త్యం గురించి వివ రించే ందుకు ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌ ఆధ్వ ర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభి నందనీయమన్నారు. ఈ పోటీ ద్వారా మహిళల్లో సంస్కృతి సంప్రదాయాలను సమాజానికి చాటి చెప్పా రని వీటిని పరిరక్షించుకోవా లన్నారు. సంక్రాంతి పండు గ వచ్చిందంటే తెలంగాణలో ప్రతి ఇల్లు ముగ్గులతో, హరిదాసులతో, పూజలతో కళకళలాడతాయని అన్నా రు. ఆ సంస్కృతిని ఆ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు ఆచరించే విధంగా ముగ్గులు వేశారని కొని యాడా రు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఆదర్శంగా తెలంగాణ పండుగలు..

ఫ అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వుట్కూరి నరేందర్‌రెడ్డి

తెలంగాణ ప్రజలు జరుపు కునే పండుగలు, ఆచరించే సంస్కృతి, సంప్రదాయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయ ని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వుట్కూరి నరేందర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పండుగలు సంస్కృతి సంప్ర దాయాలను భవిష్యత్‌ తరాల వారికి అందించడం లో భాగంగా ఆంధ్రజ్యోతి వారు ఈ ముగ్గుల పోటీ లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా నలు మూలల నుంచి ఇక్కడి వచ్చి ముగ్గులు వేసి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఈతరం పిల్లలకు స్ఫూర్తి వంతంగా నిలుస్తుందని అన్నారు.

ఫ మొదటి బహుమతి గెలుచుకున్న ఇందు..

ఈ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్న గోదావరిఖనికి చెందిన సీపెల్లి ఇందుకు రూ. 6 వేల నగదు, రెండవ బహుమతి గెలుచుకున్న ఎలిగేడుకు చెందిన గాదె లలితకు రూ.4 వేల నగదు, మూడవ బహు మతి గెలుచుకున్న కరీంనగర్‌కు చెందిన పందిర్ల స్వప్నకు రూ. 3 వేల నగదు, ప్య్రత్యేక బహుమతి గెలుచుకున్న బి విజయలక్ష్మి రూ. 2 వేల నగదును అతిథులు అందజేశారు. కన్సోలేషన్‌ బహు మతులు గెలుచుకున్న 20 మందితో పాటు మిగతా వారికి పార్టిసిపేషన్‌ బహుమతులను ఎమ్మెల్యే విజయరమణారావు, అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వి నరేందర్‌రెడ్డి, సుల్తానాబాద్‌ మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ గాజుల లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్‌ బిరుదు సమత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌ అందజే శారు. న్యాయ నిర్ణేతలు రిటైర్డ్‌ హెచ్‌ఎం వనజ, తెలుగు ఉపాధ్యా యురాలు మంగాదేవి, హిందీ పండిట్‌ కవిత, అల్ఫోర్స్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ సత్యం, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ బుర్ర సంపత్‌ కుమార్‌గౌడ్‌, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు సాదుల సుగుణాకర్‌, బుర్ర తిరుపతి, చింతకింద చంద్రమొగిలి, సీపెల్లి రాజేశం, నాగులమల్యాల శివాచారి, రామిడి మృత్యుంజయం, ఆంధ్ర జ్యోతి ఫొటో జర్నలిస్టు ఎండీ షుకూర్‌, ఏబీఎన్‌ వీడియోజర్నలిస్టు పి కుమా ర్‌, సర్క్యూలేషన్‌ సిబ్బంది రమేష్‌, సంతోష్‌, అల్ఫోర్స్‌ సిబ్బంది బైరి రవీందర్‌, సంపత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 01:22 AM