ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:38 AM
పాత సంవత్సరానికి బైబై చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మంగళవారం అర్ధరాత్రి యువకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్/మార్కండేయకాలనీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పాత సంవత్సరానికి బైబై చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మంగళవారం అర్ధరాత్రి యువకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడవాడలా డీజే సౌండ్లు పెట్టుకుని నృత్యాలు చేస్తూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జులాయిల ఆగడాలు కట్టించేందుకు ప్రతి కూడలిలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పారిశ్రామిక ప్రాంతం పోలీస్ వలయంగా మారింది. దీంతో జులాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది. మంగళవారం రాత్రి 10గంటల నుంచే రామగుండం సీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, గోదావరిఖని ఏసీపీ రమేష్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బుధవారం గోదావరిఖని చౌరస్తాలోని వైట్ హౌస్‌లో కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, వివిధ రాజ కీయ పక్షాల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాల రాజ్‌కు మార్, ముస్తాఫా, నాయకులు చుక్కల శ్రీనివాస్, గట్ల రమేష్, సన్ని, హమీద్, సిరాజ్, బీజేపీ నాయ కులు మామిడి రాజేష్, మహవాది రామన్న, సీపీఐ నాయకులు కే స్వామి పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మహిళలు ఇంటిముందు రంగు రంగుల ముగ్గులు వేశారు.
ముత్తారం (ఆంధ్రజ్యోతి): మండలంలో నూ తన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యయి. గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద యూత్ సభ్యులు కేక్ కట్ చేసి పాత సంవత్సరానికి వేడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వగతం పలికారు. బుధవారం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఎలిగేడు (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంతో పాటు 11గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం పలు దేవాల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రజలు, రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నా రు. ఆలయాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.
మంథని (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో నూతన ఆలోచనలుచేస్తూ నూతన ఉజ్జీవంతో ముం దుకు సాగాలని రెవరెండ్ వల్లూరి ప్రభాకర్ అన్నా రు. స్థానిక సీయోను ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేక్ కట్ చేసి సహపంక్తి భోజనాలు చేశారు. శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మండ లంలోని ధర్మారం గ్రామంలో సీయోను ప్రార్ధన మం దిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు మహేష్, మార్క్, దయ రాజ్, స మూయేలు, రాజేష్, సంఘ పెద్దలు అంకరి కుమార్, జోసఫ్, ప్రసాద్, రమేష్, ప్రేమ్‌కుమార్, సదానందం, కుమార్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్ (ఆంధ్రజ్యోతి): నూతన సంవ త్సర వేడుకలను సుల్తానాబాద్‌లో వ్యవసాయ కూలీ లు ఘనంగా జరుపుకున్నారు. పొలంలో నాట్లు వేసు కోవడానికి వచ్చిన వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు దేవాలయాలను సందర్శిం చి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. వేడుకల సందర్భంగా ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సుల్తానాబాద్ పోలీసులు మంగళవా రం రాత్రి నుంచి బుధవారం వరకు పలుచోట్ల తని ఖీలు నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు.
ఓదెల (ఆంధ్రజ్యోతి) : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గురువారం ఉద్యమకారుల ఫో రం ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో పూజలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలనలో గ్రామాల అభివృద్ధి చెందాలని మల్లి కార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అనం తరం అక్కడికి వచ్చిన భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టియుఎఫ్ రాష్ట్ర కార్య దర్శి కందుల సదాశివ్, జంగం కొమురయ్య, నేదురి మల్లేష్, సుంచు సంపత్, గుర్రం సదానందం, కందు ల అభిలాష్, కందుల రిషిద్ కుమార్, మొగిలి సాయికుమార్, లక్ష్మణ్, మొగిలి అనిల్, తోట్ల సిద్దు, సూత్రాల సదానందం, చెరుకు సదయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.