Share News

నూతన సంవత్సర వేడుకలకు భారీ బందోబస్తు

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:44 AM

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నూతన సంవత్సర వేడుకలకు భారీ బందోబస్తు

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచే పోలీసులు ముఖ్య కూడళ్లు, రహదారులపై తనిఖీలు ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలంటూ పోలీస్‌కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి ప్రజలకు సూచించారు. మొబైల్‌ టీంలు రోడ్లపై పెట్రోలింగ్‌ నిర్వహించాయి. ముఖ్య ముఖ్య కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కమిషనరేట్‌ కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పరిస్థితిని గమనిస్తూ క్షేత్రస్థాయిలోని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌ టౌన్‌లో 300 మంది. కమిషనరేట్‌ వ్యాప్తంగా 400 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సాట్‌ టీం, స్పెషల్‌ టీంలు 24 గంటలపాటు రోడ్లపైనే ఉంటూ వాహన తనిఖీలు చేపట్టాయి. సీపీ అభిషేక్‌ మొహంతి రాత్రి కమిషనరేట్‌ వ్యాప్తంగా తిరుగుతూ తనిఖీలను పర్యవేక్షించారు.

ఫ అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు

ప్రభుత్వ అనుమతులతో వైన్‌షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లను రాత్రి ఒంటి గంట వరకు అనుమతించడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయు. తిమ్మాపూర్‌, రేకుర్తి ప్రాంతాల్లో మూడు ఈవెంట్లను మాత్రమే ఎక్సైజ్‌ అధికారులు అనుమతి ఇచ్చారు.

Updated Date - Jan 01 , 2025 | 12:44 AM