బీఆర్‌ఎస్‌లో సంస్థాగతమెప్పుడో..?
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:16 AM
సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు పదవుల భ ర్తీపై బీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి సారించడం లేదు. గతంలో 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకం గా వ్యవహరించి పదవులు కేటాయిస్తూ పర్యవేక్షిస్తూ ఉండేది.
- గుర్తింపు కోసం తమ్ముళ్ల ఆరాటం
- ఊరిస్తున్న పదవులు...దక్కకపోవడంతో నిరాశ
- కేవలం అధ్యక్ష పదవికే పరిమితమైన జిల్లా కమిటీ
- కార్యవర్గం ఏర్పాటు..అనుబంద కమిటీల కోసం తప్పని ఎదురుచూపులు
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నా.. వీడని సందిగ్ధం
జగిత్యాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు పదవుల భ ర్తీపై బీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి సారించడం లేదు. గతంలో 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకం గా వ్యవహరించి పదవులు కేటాయిస్తూ పర్యవేక్షిస్తూ ఉండేది. కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తుండడంతో కేడర్ నైరాశ్యంతో ఉంటోంది. ఏళ్ల తరబడి పార్టీ కమిటీల్లోనూ చోటు దక్కుతుందని భా వించినప్పటికీ నిరాశే ఎదురవుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ క మిటీలు వేస్తారా... వేయరా... ఇలాగే కాలం వెళ్లదీస్తారా... అనేది పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది పార్టీ పదవుల ఇస్తే పార్టీ చే పట్టే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు బలోపేతానికి తమ వంతు కృషిచేస్తామని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో గతంలో బీఆర్‌ఎస్ ఇలా..
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజక వర్గాల్లో గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. ధర్మపురి ని యోజకవర్గం నుంచి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్ గ త ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. అదేవి ధంగా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి సై తం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రా వు, డాక్టర్ సంజయ్ కుమార్ గత ప్రభుత్వ హయాం లో బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా బీఆర్‌ఎస్ నేత ఎల్ రమణ వ్యవహరిస్తున్నారు. గత యేడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలు పొందగా, కోరుట్ల, జగిత్యాల బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ మాకునూరి సంజ య్ కుమార్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మారారు. ప్రస్తుతం జిల్లాలో బీఆర్‌ఎస్ పునర్‌వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి కరువు..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ రెండు పార్యాయాలు అధికారంలో ఉంది. అయినప్పటికీ పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయలేదని, ఆ దిశగా దృష్టి సారించలేదని పార్టీ నేతలు పలు సందర్బాల్లో అంటున్నారు. అధికారం కోల్పోయి ఏడాది కావస్తున్నప్పటికీ పార్టీ సంస్థాగత బలో పేతంపై దృష్టి సారించ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కమి టీలతో పాటు అనుబంధ కమిటీలను వేస్తే.. అధిష్టానం ప్రజా సమస్య లపై ఇచ్చే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్న అభిప్రా యాలున్నాయి. ఇప్పటివరకు జిల్లా స్థాయి పూర్తి కమిటీలు, అనుబంధ కమిటీలు లేవు. కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహ రిస్తున్నారు. జిల్లా కమిటీలో పూర్తి కార్యవర్గం కానీ, అనుబంద కమిటీల నియామకం జరగడం లేదు. దీంతో జిల్లాలో యాక్టీవ్‌గా పని చేస్తున్న కేడర్ నిరాశకు గురవుతున్నారు.
కమిటీలపై గులాబీ తమ్ముళ్ల నిరాశ...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే పని చే స్తున్నామని, పలువురు నాయకులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా రు. ఒకసారి కాక పోయినా ఇంకోసారైనా అవకాశం వస్తుందని ఆశిస్తు న్నారు. రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో చోటు దక్కుతుందని, జిల్లా కమిటీల్లో నూ అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ అసలు కమిటీల వేయడా నికి పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టకపోవడంతో నైరాశ్యంలో కొట్టుమి ట్టాడుతున్నారు. త్వరలో కమిటీలు వేస్తామని, యాక్ట్టివ్‌గా పనిచేసేవారికి అవకాశం ఇస్తామని, పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తింపు ఇస్తుందని తరుచుగా పేర్కొంటున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న అ భిప్రా యాలు బీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
గుర్తింపులేదంటూ ఆవేదన..
బీఆర్‌ఎస్ పార్టీకి నాయకులు, కేడర్ ఉంది. యాక్టివ్‌గా పనిచేసేవారు ఉన్నారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వడంతో పాటు విజయవం తానికి కృషి చేస్తున్నారు. కానీ వారికి పార్టీలో కష్టానికి సము చిత స్థానం దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నప్పటికీ ఇతర పార్టీల్లో నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇ స్తున్నారని, తమను విస్మరిస్తున్నారని పలువురు పార్టీ నేతలే బహిరం గంగా అభిప్రాయపడుతున్నారు.
స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నా...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ హామీలు, గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కొంత జాప్యం జరు గుతుంది. ఈ జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ నేత లు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు సమీపిస్తున్న పార్టీ సంస్థాగతంపై అధిష్టానం ఫోకస్ పెట్టడం లేదు.