కౌశిక్‌రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:20 AM
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తనపై దాడికి యత్నించిన కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం డాక్టర్ సంజయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్ క్రైం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తనపై దాడికి యత్నించిన కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం డాక్టర్ సంజయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. తనను కౌశిక్‌రెడ్డి చేయితో నెట్టివేశాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తాను ఎపుడు కూడా ఏ వ్యక్తిని దూషించలేదని అన్నారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడాలని అనుకుంటే ఆయన ఆటంకం కలిగించాడని అన్నారు. జగిత్యాల అభివృద్ది కోసమే తనను గెలిపించారని, అభివృద్ది చేయడం తన బాధ్యత అని అన్నారు. కౌశిక్‌రెడ్డి దురుసుగా ప్రవర్తనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తే ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. తనకు అండగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిారు.
ఫ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు
పోలీసు అధికారులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వాంగ్మూలాన్ని సోమవారం రికార్డు చేశారు. ఎమ్మెల్యే కరీంనగర్ పోలీసు ఠాణాకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న జగిత్యాల కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాంగ్మూలం రికార్డు చేసిన తరువాత ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పరీక్షలు చేసుకుని జగిత్యాలకు వెళ్లిపోయారు.