Share News

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:51 AM

సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో చేపడుతున్న పలు రోడ్లు, డ్రైనేజీల నూతన నిర్మాణాలను కలె క్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పరిశీలించారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

సుల్తానాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో చేపడుతున్న పలు రోడ్లు, డ్రైనేజీల నూతన నిర్మాణాలను కలె క్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ సుల్తానాబాద్‌ పట్టణంలో ఇప్ప టికే రూ.15కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేప ట్టినట్లు తెలిపారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి శాంతినగర్‌ వరకు రూ.2.70కోట్లను మంజూరు చేసి రోడ్డు పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పా రు. అంబేద్కర్‌ చౌరస్తా, ఎంపీడీవో కార్యాల యం చౌరస్తాలను ఐర్లాండ్‌ నమూనాలో అభివృ ద్ధి చేస్తామని, మధ్యలో డివైడర్‌ నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం అదనంగా రూ.2.50 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌ డ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాజుల లక్ష్మిరాజమ ల్లు, ఏఎంసీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ బిరుదు సమతాకృష్ణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్‌, చిలుక సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:51 AM