Share News

సొంతింటి పథకంపై ఉద్యమం : సీఐటీయూ

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:59 AM

సింగరేణి ఎన్నికల్లో అనేక హామీలిచ్చిన గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల పథకాలపై కార్మికులు ఉద్యమానికి సిద్ధంగా ఉం డాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.

సొంతింటి పథకంపై ఉద్యమం : సీఐటీయూ

రామగిరి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఎన్నికల్లో అనేక హామీలిచ్చిన గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల పథకాలపై కార్మికులు ఉద్యమానికి సిద్ధంగా ఉం డాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. శనివా రం సింగరేణి ఏపీఏ డివిజన్‌ పరిధిలోని ఏఎల్‌పీలో నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సొంతింటి పథకం,పెర్క్స్‌మీద ఐటీ మినహాయింపు, మారు పేర్ల మర్పిడి, ప్రభుత్వం రూ.33వేల కోట్ల బకాయిలు వంటి అనేక ప్రధాన సమ స్యలను మేనిఫెస్టోలో పెట్టుకొని గెలిచిన సంఘాలు కార్మికులకు జవాబు చెప్పా ల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మికుల సమస్య పరిష్కారం కోరుతూ సీఎండీకి వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు దొమ్మటి కొమురయ్య, ఆహ్మద్‌పాషా, ప్రభాకర్‌, వేణుగొపాల్‌, సదానందం, క్వా తం రాజేష్‌, రంజిత్‌, విజేందర్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:59 AM